Lokesh Kanagaraj : వామ్మో ఇదేం బుర్ర… లోకేష్ కనగరాజ్..ఓకే సారి ఇన్ని సినిమాలు ఎలా ?

లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ). ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ దర్శకుడుగా ఈయనకు పేరు ఉంది.

చాలా ఏళ్లుగా ఒక్క విజయ కోసం ఎదురు చూసిన కమల్ హాసన్ కి విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ గిఫ్ట్ గా ఇచ్చిన లోకేష్ ఆ మత్తు దిగకుండానే విజయ్ తో లియో( Leo ) అనే సినిమా స్టార్ట్ చేశారు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా కేవలం 6 నెలలలోనే సినిమాను పూర్తి చేసి ప్యాకప్ చేయడం లోకేష్ కి అలవాటై పోయింది.దాంతో అక్టోబర్ లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగానే మరోవైపు ఒకటి తర్వాత ఒకటి సినిమాలను లైన్లో పెట్టే పనిలో పడ్డాడు లోకేష్ కనగరాజ్.

సాధారణంగా ఒక హీరోకి నాలుగైదు సినిమాలో లైన్ లో ఉండడం కామనే.కానీ ఒక దర్శకుడికి దాదాపు నెక్స్ట్ కొన్నేళ్ల పాటు సినిమాలు లైన్ లో ఉండడం అనేది లోకేష్ ను చూసిన తర్వాతే తెలుస్తోంది.

మరి అతడు చేస్తున్న ఆ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఏంటి? ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

విజయ్( Hero Vijay ) లియో చిత్రం తర్వాత రజనీకాంత్ తో ఒక సినిమా ప్రకటించాడు లోకేష్.ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.సినిమా సినిమాకు ఎలాంటి గ్యాప్ లేకుండా నిమిషం కూడా ఖాళీ ఉండకుండా చూసుకుంటున్నాడు.

రజనీకాంత్ సినిమా సెట్స్ మీదికి వెళ్ళక ముందే ఖైదీ మరియు విక్రమ్( Vikram ) సినిమాలకు సీక్వెన్స్ కూడా ప్రకటించేశాడు.కేవలం తమిళ సినిమాలను మాత్రమే కాదు బ్యాక్ టు బ్యాక్ నా గురించి ఐదు సినిమాలు లైన్ లో పెట్టి టాలీవుడ్ పై కూడా తన ఫోకస్ పెట్టాడు.

ప్రభాస్ మరియు రామ్ చరణ్ లతో చెరొక ప్రాజెక్టు కూడా చేయబోతున్నట్టు తెలిపాడు లోకేష్ కనగరాజ్.

ఇప్పటికే తన సమకాలీకుడు అయిన అట్లీ బాలీవుడ్ లో పాగా వేస్తున్న సమయంలో లోకేష్ మాత్రమే సౌత్ ఇండియా కే స్థిరపడిపోతే ఎలా ఉంటుంది అనుకున్నాడో ఏమో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్( Multistarrer ) ని కూడా ప్లాన్ చేస్తున్నాడు.మరి ఇన్ని సినిమాలు ఒక దర్శకుడు ప్లాన్ చేయాలి అంటే ఎంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయాలి ఏ మేరకు సన్నాహాలు చేసుకుంటే ఇన్ని సినిమాలు ఒకేసారి ఊపందుకుంటాయి.మూడు భాషల్లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు లోకేష్ కనగారాజ్ బుర్ర ఏ రేంజ్ లో పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు