శ్రీకాకుళంలో భారీ డబ్బుతో అడ్డంగా దొరికిన వైసీపీ నేత

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులు తాము సంపాదించుకున్న నల్లదనం బయటకి తీస్తున్నారు.ఇక ఎన్నికలలో ప్రజల ఓట్లుని కొనడమే లక్ష్యం.

 Lok Sabha 2019 Election Money Liquor Flow In Andhra Pradesh-TeluguStop.com

రాజకీయ నాయకులు డబ్బు ప్రవాహానికి తెరతీసారు.ఇక దేశంలో ఎప్పుడూ లేనంత డబ్బు ఈ ఎన్నికల సమయంలోనే కనిపిస్తుంది.

ఇక ప్రజలు కూడా అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటూ రెండు చేతులా ఫుల్ గా సంపాదిస్తారు.

ఏపీలో ఎన్నికలకి మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రలోభాలకి తెరతీస్తున్నాయి.

రెండు రోజుల క్రితం టీడీపీ ఎంపీ మురళీమోహన్ కి చెందిన రెండు కోట్ల రూపాయిలు హైదరాబాద్ లో దొరికాయి.తాజాగా శ్రీకాకుళం జిల్లాలో రాజాంలో వైసీపీ నేత పాలవలస విక్రాంత్ ఆర్టీసి బస్సు లో ఐదు కోట్ల రూపాయిలు బ్యాగ్ లతో తరలిస్తూ అడ్డంగా దొరికేసారు.

వాటిని ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని విచారించే పనిలో పోలీసులు ఉన్నారు.

మరో వైపు వైసీపీ పార్టీ నేతలు అయితే ఏకంగా ప్రచార సభలలో ప్రజల మీదకి డబ్బులు వెదజల్లుతూ మీడియాకి చిక్కుతున్నారు.ఇక ఏపీలో భారీ ఎత్తున నగదు పంపిణీ చేస్తూ ప్రధాన పార్టీల కార్యకర్తలు పోలీసులకి చిక్కుతున్నారు.మరో వైపు మద్యం కూడా విచ్చలవిడిగా తరలిస్తూ దొరికిపోతున్నారు.

నీళ్ళ ట్యాంక్ లలో మంచినీళ్ళు తరలిస్తున్న దృశ్యాలు కూడా వెలుగు చూసాయి.మద్యపాన నిషేధం అని చెబుతున్న వైసీపీ కూడా మద్యం సీసాలతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ పోలీసులకి దొరకడం విశేషం.

మరి ఈ ప్రలోభాలకి లొంగిపోయే ప్రజలు ఈ సారి ఎవరికి అధికారం ఇస్తారు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube