లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం మరోసారి సడలించినట్లు తెలుస్తుంది.గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను సవరించి శుక్రవారం అర్ధరాత్రి నుంచి కొత్త ఉత్తర్వులను విడుదల చేసినట్లు సమాచారం.
కరోనా నేపథ్యంలో గత కొద్దీ రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.దీనితో వ్యాపారులు నష్టపోతుండడం తో పాటు జనాలు కూడా నిత్యావసర వస్తువులు కూడా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ కేంద్రం చేసింది.అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం నిత్యావసర వస్తువుల షాపులకు మాత్రమే అనుమతి ని ఇవ్వడం తో తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ ఆ ఉత్తర్వులను సవరిస్తూ నూతన ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకూ నిత్యావసర వస్తువుల షాపులకు మాత్రమే అనుమతి ఇవ్వగా శుక్రవారం అర్ధరాత్రి ఆ ఉత్తర్వులను సవరిస్తూ కొత్త ఉత్తర్వులను వెల్లడించింది.తాజా నిబంధనల ప్రకారం గ్రామీణ, చిన్నపట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
దీంతో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది.అయితే అలానే కరోనా హాట్ స్పాట్ లు, కంటైనర్ జోన్‌లలో మాత్రం అన్ని దుకాణాలను మాత్రం మూసే ఉంచాలి అంటూ కేంద్రం స్పష్టం చేసింది.
అంతేకాకుండా కొత్తగా అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లోనూ కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తుంది.
షాపులు తెరిచేందుకు అనుతిచ్చిన ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.
షాపులు తీసినవారు కేవలం 50 శాతం సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ.మాస్కులు, శానిటైజర్లు వాడడం అనేది తప్పనిసరి అని స్పష్టం చేసింది.
అలానే మున్సిపాల్టీ పరిధిలో ఉన్న మార్కెట్ ప్రదేశాలు, మల్టీబ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ మే 3వ తేదీ వరకు మూసివేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.