లాక్‌డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆంక్షలకు మంగళం.. !

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి లాక్‌డౌన్ మే 12నుండి విధించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ వల్ల విధించిన లాక్‌డౌన్ నుండి ప్రజలు ఆర్ధికంగా కోలుకోక ముందే కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడింది.

దీనికి తోడు ఆకాశాన్నంటే ధరలు వెరసి సామాన్యుడి ఊపిరి ఆగిపోయేలా కరోనా పరిస్దితులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.ఇదిలా ఉండగా ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

Telangana Govt, Lockdown Lifted, Covid 19, KCR-లాక్‌డౌన్ ప�

ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణలో విధించిన లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా కేసుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

కాగా ఇప్పటి వరకు అమలులో ఉన్న కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది.ఇక ఎప్పటిలాగే అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Advertisement
13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

తాజా వార్తలు