వడ్డీ కి డబ్బులిచ్చి ఆంటీ ని లైన్ లో పెట్టిన అంకుల్.. చివరికి...

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు వ్యామోహంలో పడి తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కాగా తాజాగా ఓ వ్యక్తి పెళ్ళైన మహిళకి వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ఆమె చేతిలోనే దారుణంగా హత మార్చబడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తిరుపూర్ పరిసర ప్రాంతంలో "సంతోష్" అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే సంతోష్ కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేయడం మరియు వడ్డీలకు డబ్బులు ఇస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఇటీవల స్థానికంగా ఉన్నటువంటి ఓ మహిళ డబ్బు అవసరం కావడంతో సంతోష్ వద్దకు వచ్చి కొంత డబ్బులు అప్పుగా తీసుకుంది.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో అతికొద్ది సమయంలోనే ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

దీంతో సంతోష్ తన కోరిక తీర్చినందుకుగాను మహిళతో వడ్డీ తీసుకోవడం మానేశాడు.అయితే అప్పటికే పెళ్లయి పిల్లలున్న మహిళ కూడా తన ఆర్థిక అవసరాల నిమిత్తమై సంతోష్ ని బాగానే ఉపయోగించుకుంది.

Advertisement

అయితే ఈ మధ్య కాలంలో ఈ విషయం కాస్తా మహిళ కొడుక్కి తెలియడంతో గత కొద్ది కాలంగా మహిళ సంతోష్ ని దూరం పెట్టింది.దీంతో విరహ వేదనతో రగిలిపోయిన సంతోష్ ఎలాగైనా తన కోరిక తీర్చాలని మహిళని ఇబ్బంది పెట్టాడు.అయినప్పటికీ మహిళ ససేమిరా అనడంతో తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని నానా హంగామా చేశాడు.

దీంతో మహిళ సంతోష్ ని హతమార్చాలని పన్నాగం పన్నింది.ఈ క్రమంలో తన కొడుకు మరియు స్నేహితుల ద్వారా సంతోష్ ని హత్య చేసి దగ్గరలో ఉన్నటువంటి క్వారీలో మృత దేహాన్ని విసిరేసింది.

అయితే ఇటీవలే మృతదేహం వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో సంతోష్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా మహిళని అదుపులోకి తీసుకొని విచారించగా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నాడని కారణంగా తామే హతమార్చినట్లు అంగీకరించింది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు