వైరల్: బిడ్డని కాపాడుకునేందుకు ఏనుగుకి భయపడిన సింహం... తల్లి ఎవరికైనా తల్లే!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అనేక రకాల విషయాలను మనం తిలకించగలుగుతున్నాం.

మరీ ముఖ్యంగా ఇక్కడ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొట్టడం మనం చూస్తూ వున్నాం.

ఎందుకంటే జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి.సోషల్ మీడియా అందుబాటులోకి రానంత వరకూ జంతు ప్రపంచం ఎలా ఉంటుందో జనాలకి పెద్దగా తెలియదు.

కొంతమంది డిస్కవరీ ఛానెల్‌పై ఆధారపడే వారు.అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

చేతిలోనే ప్రపంచపు వింత విశేషాలను ఇపుడు ఎంచక్కా చూసేస్తున్నారు.ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Advertisement

ఈ ఫన్నీ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తల్లి ప్రేమ( Mothers Love ) ఎవరికైనా ఒక్కటే అని అభిప్రాయపడతారు.

అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో సింహం( Lion ) ముందు వరుసలో ఉంటుంది.అందుకే అడవి రాజు సింహం అని చెబుతూ వుంటారు.అడవిలో మిగతా జంతువులకు సింహం అంటే హడలే.

మరి అలాంటి సింహం కూడా తన బిడ్డలను( Lion Cubs ) ఏవిధంగా సంరక్షిస్తుందో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే ఏనుగుని( Elephant ) చూసి భయంతో పారిపోతున్న సింహాన్ని చూడవచ్చు.

ఒక ఆడ సింహం గడ్డి పొదల్లో తన ముగ్గురు పిల్లలతో కలిసి కూర్చుంది.వాటితో సరదాగా ఆడుకుంటుంది.ఇంతలో అటుగా ఒక భారీ ఏనుగు వస్తుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

అది చూసి సింహం చాలా కంగారుగా సింహం భయంతో వణికి.ముందుగా తన పిల్లలను దాచడానికి ప్రయత్నించింది.

Advertisement

అయితే తన మూడు పిల్లలను ఏనుగునుంచి రక్షించడం కష్టం అని అనుకుందో ఏమో.ఒక పిల్లను తన నోట కరుచుకుని పారిపోయింది.

అయితే సింహం భయపడినట్టు అక్కడ ఏమి జరగలేదు.ఏనుగు మిగిలిన రెండు పిల్లలను దాటుకొని మరీ వెళ్ళిపోతుంది.ఈ వీడియోను యూట్యూబ్‌లో మాసాయి సైటింగ్స్ షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతుంది.

ఇప్పటికే లక్షల్లో లైక్స్, వేళల్లో కామెంట్స్ ను సొంతం చేసుకుంది.కొంతమంది ఇక్కడ కామెంట్ చేస్తూ."సింహం ఏనుగుతో పోరాడగలదు.

అయితే ఇక్కడ తన తన పిల్లల గురించి ఆలోచించింది.అందుకనే అక్కడ నుంచి పారిపోయింది" అని రాసుకొచ్చారు.

మరికొంతమంది "తల్లి పిల్లల కోసమే ఈ తన అడుగులు మార్చుకుంది" అని వ్యాఖ్యానించగా.మరికొందరు "ఈ వీడియో నిజంగా సరదాగా ఉంది" అని కామెంట్ చేయడం గమనించవచ్చు.

తాజా వార్తలు