సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ, కొన్ని వీడియోలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి.అవి మనల్ని కట్టిపడేస్తాయి కూడా.
ముఖ్యంగా అడవి జంతువుల వీడియోలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.ప్రస్తుతం, అడవికి సంబంధించిన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియో క్రూరమైన సింహం, అడవి రాజుకు సంబంధించినది.ఈ క్లిప్‌లో ఒక సింహం పిల్లను( Lion Cub ) చూడవచ్చు.
అది చాలా చిన్నగానే ఉంది.అయినా గుండె ధైర్యంతో తనకంటే మూడు రెట్ల ఎత్తైన జంతువులను వేటాడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇది ఆత్మవిశ్వాసంతో వేట ప్రాక్టీస్ చేస్తోంది.సాధారణంగా సింహం పిల్లలు ఆరువారాల వైపు నుంచే వేట ప్రారంభిస్తాయి.
కాకపోతే అవి తమ సైజుకి తగిన హంటింగ్( Hunting ) మాత్రమే చేస్తాయి కానీ వైరల్ వీడియోలో కనిపిస్తున్న సింహం పిల్ల మాత్రం పెద్దవాటిని టార్గెట్ చేస్తోంది.

వైరల్ వీడియోలో ఒక తల్లి సింహంతో పాటు సింహం పిల్ల కనిపించడం చూడవచ్చు.ఈ చిన్న పిల్ల దానికి సమీపంలో ఉన్న వైల్డ్ బీస్ట్( Wildbeest ) అనే ఒక ఆఫ్రికన్ జింకను వేటాడేందుకు ముందుకు కదలడం గమనించవచ్చు.ఇది చిన్నదే అయినా పెద్ద జింకలను సైతం వణికించేంత ఆత్మవిశ్వాసం చూపించింది.
ఈ పిల్ల సింహం సరిగ్గా రాజులా వాకింగ్ చేస్తూ ఫిదా చేసింది.

చిన్న సింహం తన తల్లిని చూసి నడవడం నేర్చుకున్న తీరు చూసి చాలామంది మంత్రముగ్ధులవుతున్నారు.మాసాయి సైటింగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన ఈ వీడియోకు 1 లక్షా 57 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.







