రాజకీయం ప్రస్థానంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో పార్టీలు ఎంతో మంది లీడర్లు ఉన్నారు.ఇందులో చాలామంది లీడర్లు ఇప్పటికి ఎన్నోసార్లు ప్రజలను పాలించారు.
ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ లీడర్ అయినా అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కానీ అడుగు పెట్టాలి అంటే తప్పనిసరిగా ప్రజల చేత ఎన్నుకోబడాలి.ప్రజల దీవెన ఉంటే తప్పనిసరిగా ఆ లీడర్ ఎదుగుతారు.
అలా ఇప్పటివరకు ఎంతో మంది లీడర్లు ప్రజల ఆశీర్వాదంతో పార్లమెంటులో అసెంబ్లీలో అడుగు పెట్టారు.ఇలా ప్రజల అదృష్టంతో గెలిచిన చాలామంది లీడర్లు ఏదో ఒక సెంటిమెంట్లు మాత్రం నమ్ముతాడు.
ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ( KCR ) తను రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పటి నుంచి సిద్దిపేటలోని కోనాయిపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామిని ముందుగా దర్శించుకుని ఆ తర్వాత నామినేషన్స్ వేస్తారు.అలా వేయడం వల్ల ఆయన తప్పనిసరిగా విజయం సాధిస్తారని నమ్మకం.
అయితే ఆయన రాజకీయం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ స్వామిని దర్శించుకుని నామినేషన్ వేసి ఎక్కడ కూడా అపజయాన్ని చూడలేదు.
ఈ విధంగా ఈ సెంటిమెంట్ ని కేసీఆర్ ఫాలో అవుతారు.అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth reddy) కూడా ఒక సెంటిమెంటును ఫాలో అవుతారని చాలామందికి తెలియదు.కానీ ఆయన ఆ సెంటిమెంట్లు రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఫాలో అవుతున్నారట.
అదేంటో పూర్తిగా చూద్దాం.రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజకీయ పరిధిలో దిగిన క్వాలిస్ సెంటిమెంట్ పాటిస్తారు.
తప్పనిసరిగా ఆ క్వాలిస్ లోనే ఆయన తిరుగుతూ ఎన్నికల బరిలో నిలుస్తారు.ఆయన ఉమ్మడి ఏపీలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జెడ్పిటిసి సభ్యుడిగా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈ క్వాలిస్ లోనే వెళ్లారట.
అప్పుడు విజయం సాధించారు.ఆ తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా కల్వకుర్తి మండలం నుంచి ఇండిపెండెంట్గా రేవంత్ రెడ్డి పోటీ విజయం సాధించారు.అప్పుడు కూడా క్వాలిస్ వాహనాన్ని ఉపయోగించారట.అలాగే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ ( Kodangal ) నుంచి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు.ఈ క్రమంలో గుర్నాథ్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించారు.ఆ తర్వాత 2014, 2018 లో కూడా పోటీ చేసి విజయం సాధించారు.
దీని తర్వాత ఒకసారి ఓడిపోయి మళ్ళీ 2019లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ఇలా తాను పోటీ చేసినప్పటి నుంచి ఏ ఎన్నికల్లో అయినా మన క్వాలిస్ వాహనంలోనే ప్రచారం చేసి నామినేషన్ వేశారట.
ఆ వాహనంలో వెళ్తే ఆయనకు కలిసి వస్తుందని విజయం తప్పక వరిస్తుందని సెంటిమెంటును ఇప్పటికి కూడా పాటిస్తున్నారట.మరి ఈసారి కూడా రేవంత్ రెడ్డి పోటీ చేసే స్థానాల్లో అదే క్వాలిస్ వాహనంలో వెళ్ళను నట్టు తెలుస్తోంది.
మరి చూడాలి ఆ సెంటిమెంట్ ఈసారి రేవంత్ రెడ్డి ని ఏ స్థాయిలో ఉంచుతుందో ముందు ముందు తెలుస్తుంది.