Ap CM Jagan : జనాల సమస్యలపై 'జగనన్న కు చెబుదాం '

ఏపీ అధికార పార్టీ వైసిపి ప్రజలకు మరింత దగ్గర ఎందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేసింది.

 Let's Tell Jagananna About People's Problems , Jagan, Ap Cm Jagan, Ysrcp, Tdp,-TeluguStop.com

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు 90% పూర్తిచేసింది అయినా. వైసీపీపై మొదట్లో ఉన్నంత సానుకూలత ప్రజల్లో ఇప్పుడు లేకపోవడం , రాజకీయ శత్రువులు రోజురోజుకు బలం పెంచుకుంటూ ఉండడం, 151 స్థానాలను 2019 ఎన్నికల్లో గెలుచుకున్నా.2024 ఎన్నికల్లో 175 స్థానాలనూ గెలుచుకోవాలనే లక్ష్యాన్ని జగన్ విధించారు.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 లో సాధించిన సీట్ల కంటే బాగా తక్కువ సీట్లు వైసిపి కి వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా ఏపీలో టిడిపి తో పాటు, జనసేన బలం పెంచుకుంది.ప్రతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనాల్లో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ సక్సెస్ అవుతున్నాయి .

 ఈ నేపథ్యంలోనే  జనాలకు మరింత దగ్గర అయ్యేందుకు ‘జగనన్నకు చెబుదాం ‘ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైసిపి ప్లాన్ చేసుకుంటోంది.దీనికోసం ప్రత్యేకంగా ఓ ఫోన్ నెంబర్ ను కేటాయించాలని, సామాన్యులు తమ సమస్యలపై ఈ ఫోన్ నెంబర్ కు ఫిర్యాదు చేసే విధంగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం జనసేన చేపడుతున్న జనవాణి కార్యక్రమానికి స్పందన ఊహించినదాని కంటే ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ‘ జగనన్నకు చెబుదాం ‘ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే అధికారులు వాటిని పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Telugu Ap Cm Jagan, Jagan, Jaganannaku, Janasena, Janavani, Telugudesam, Ysrcp-P

 ప్రస్తుతం వైసీపీ ఏపీలో అధికారంలో ఉండడంతో, ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా జగనన్న కు చెబుదాం కార్యక్రమంలో చెబితే, వెంటనే అవి పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం ద్వారా వ్యతిరేకతను తగ్గించుకుని వైసీపీని మరింతగా జనాలకు దగ్గర చేసేందుకు జగన్ ఈ రకమైన వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు.త్వరలోనే దీనిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube