ఆరోగ్యకర ప్రజాస్వామ్య నిర్మాణానికి ఒక్కటవుదాం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరోగ్యకర ప్రజాస్వామ్య నిర్మాణానికి ఒక్కటవుదామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) పేర్కొన్నారు.

జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా  సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది తో కలిసి కలెక్టర్ గురువారం ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు( Assembly election ) విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులను అభినందించారు.

ఎన్నికల ప్రక్రియ నిరంతరం ఉంటుందని, నిజాయితీగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు నిరంతరం ప్రజలతో మమేకం అవుతారని, ఈ సందర్భంగా యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా, ఓటు వేసేలా ప్రోతహించాలని పిలుపు నిచ్చారు.

సీనియర్ ఓటర్లకు సన్మానం జాతీయ ఓటరు దినోత్సవం( National Voters Day ) సందర్భంగా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీనియర్ ఓటర్లను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి( Gouthami Poojari ) సన్మానించారు.అలాగే పలువురు నూతన ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.

Advertisement

కార్యక్రమాల్లో సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎస్డీసీ గంగయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా ఆరోగ్య ఉత్సవాలు
Advertisement

Latest Rajanna Sircilla News