ఆగ‌స్ట్ 12న ఓటీటీలో వ‌స్తోన్న లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

స‌హ‌స్ర సినిమాస్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`.

 Lesbian Movie Holy Wound Ott Release On August 12 Details, Lesbian Movie, Holy W-TeluguStop.com

అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు.లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సందీప్ ఆర్ మాట్లాడుతూ…“చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన ఇద్ద‌రు అమ్మాయిలు.కొంత కాలంగా క‌లిసి ఉండ‌టంతో వారిద్ద‌రి మ‌ధ్య సెక్స్ ఫీలింగ్స్ క‌లుగుతాయి.

సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు.ఈ నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి అన్న‌ది సినిమా.

డీప్ ప్రేమ‌లో ఉన్న ఇద్ద‌రు ఆడ‌వాళ్లు, ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు శృంగారంలో పాల్గొన‌డం త‌ప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం.

మా సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని.

వాట‌న్నింటినీ దాటుకొని ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం.మాట‌లు లేని ఈ సైలెన్స్ లెస్బియ‌న్ సినిమా మీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి డీఓపిః ఉన్ని మాధ‌వూర్‌; సంగీతంః రోన్ రాఫిల్; స్క్రీన్ ప్లేః పాల్ విక్‌లిఫ్‌; ఎడిటింగ్ః విపిన్ మానూర్; ద‌ర్శ‌కుడుః అశోక్ ఆరాన్‌, నిర్మాతః సందీప్ ఆర్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube