విజయ్ లియో సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనే విధంగా ఉండగా కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయిన అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసే మూవీ లియో( LEO ) అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
లియో సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నంబర్ వన్ మూవీగా నిలిస్తే విజయ్ ( Thalapathy Vijay )నంబర్ వన్ హీరో కావడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోలీవుడ్ లో విజయ్ చరిత్ర సృష్టిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చెన్నైలో ఈ సినిమాకు ఫస్ట్ డే టికెట్స్ దొరకడం కష్టమవుతోంది.
విజయ్ రేంజ్, క్రేజ్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.లియో సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. లియో సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.లియో సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

లియో సినిమాకు సీక్వెల్ ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ సినిమాతో త్రిష( Trisha )కు మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన సినిమా కావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది.తెలుగు లియో టైటిల్ వివాదంలో చిక్కుకోగా ఈ టైటిల్ కోసం 26.5 లక్షల రూపాయలు నిర్మాతలు ఖర్చు చేశారని జీఎస్టీతో కలిపి ఈ మొత్తం చెల్లించారని సమాచారం అందుతోంది.







