లెనొవో యొక్క నూతన శ్రేణి యోగా మరియు లెజియన్‌ ల్యాప్‌టాప్‌లు

లెనొవో తమ భావితరపు జ్యువెల్‌ క్రాఫ్టెడ్‌ యోగా సిరీస్‌ను విడుదల చేసింది.వీటితో పాటుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి లెజియన్‌ మరియు ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేసింది.

 Lenovo’s New Range Of Yoga And Legion Laptops Are Fueled With The Power To Create & Play-TeluguStop.com

ఇవి తమదైన శైలిలో వినియోగదారులు మరింతగా చేసేందుకు తగిన సాధికారితను అందిస్తాయి.ఈ శ్రేణి ల్యాప్‌టాప్‌లో లెజియన్‌ 5ఐ, లెజియన్‌ 5ఐ ప్రో, లెజియన్‌ స్లిమ్‌ 7ఐ మరియు ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ 3ఐతో పాటుగా యోగా 9ఐ మరియు యోగా స్లిమ్‌ 7ఐ ప్రో, యోగా 7ఐ ఉన్నాయి.

ల్యాప్‌టాప్‌లు అన్నీ కూడా 12వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు, వేగవంతమైన గ్రాఫిక్స్‌, మెరుగై బ్యాటరీ పనితీరు, సస్టెయినబల్‌ డిజైన్‌ కలిగి వినియోగదారుల కోసం లెనొవో యొక్క స్మార్టర్‌ ఆవిష్కరణలకు తోడ్పడతాయి.

నూతన సస్టెయినబల్‌, జ్యువెల్‌ టోన్డ్‌ పనితనం మరియు స్మార్ట్‌ ఏఐ శక్తివంతమైన యోగా ల్యాప్‌టాప్‌లను వినియోగదారుల పనితీరు అంచనా వేయడానికి, స్మార్టర్‌, హై పెర్‌ఫార్మెన్స్‌ గేమింగ్‌, కంటెంట్‌ సృష్టి యొక్క పరిమితులను పెంచడానికి రూపొందించబడ్డాయి.

ఈ అలా్ట్ర స్లిమ్‌ మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌లు లీనమయ్యే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే మరియు సమగ్రమైన, సౌకర్యవంతమైన ఎడ్జ్‌ డిజైన్‌ను హ్యుమనైజింగ్‌ సాఫ్ట్‌ కాంటూర్స్‌తో సౌకర్యవంతమైన మరియు సులభయైన మొబిలిటీ, హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటాయి.

నూతన లెజియన్‌ మరియు ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు మహోన్నత ఆవిష్కరణలను పనితీరు మరియు లీనమయ్యే గేమింగ్‌ అనుభవాలను తీసుకువస్తుంది.

కనీస డిజైన్‌ భాష ప్రభావవంతమైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌కు అనుగుణంగా ఉంటుంది.ఈ నూతన బ్యాటిల్‌ రెడీ లెనెవో 5జీ సిరీస్‌ అంచనాలను మించి ఉండటంతో పాటుగా ఆవిష్కరణల పరంగా తొలిసారి అనతగ్గ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఇవి ఆధునిక గేమర్లు, ప్రొఫెషనల్‌ ప్లేయర్ల అవసరాలను బహుముఖంగా తీర్చనున్నాయి.ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ 3ఐ లో శక్తివంతమైన ప్రాసెసింగ్‌ మరియు గ్రాఫిక్స్‌ వంటివి ఔత్సాహిక గేమింగ్‌ శక్తి మరియు మహోన్నతమైన స్ట్రీమింగ్‌ కోసం అందుబాటులో ఉండటం వల్ల మొదటిసారి గేమింగ్‌ ఆడేవారికి అత్యున్నత ఎంపికగా ఉంటుంది.

ఈ ఉపకరణంలో ముందుగానే లోడ్‌ చేసిన మూడు నెలల ఎక్స్‌బాక్స్‌ గేమ్స్‌ పాస్‌ ఉంది మరియు లెనోవో లెజియన్‌ అల్టిమేట్‌ సపోర్ట్‌ (ఎల్‌యుఎస్‌) సైతం వినియోగదారులకు అందుబాటులో ఉంది.

వినియోగదారులు ప్రీమియం కేర్‌, లెనోవో యొక్క సీఓ2 ఆఫ్‌ సెట్‌ సర్వీస్‌ను ఈ ఉపకరణాలపై కొనుగోలు చేసేందుకు పొందవచ్చు.

‘‘దక్షిణ భారతదేశంలో 120కు పైగా లెనెవో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు కలిగి ఉండటం చేత వినియోగదారులు అసలైన పనితీరు అనుభవాలను పొందడంతో పాటుగా సౌకర్యవంతమైన మొబిలిటీని మా నూతన శ్రేణి యోగ, లెజియన్‌, ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌లాప్‌లలో పొందవచ్చు.మా స్టోర్లలోని బృందాలు వినియోగదారులు సరైన ఉపకరణాలను ఎంచుకోవడంలో తోడ్పడగలరు.

అది ప్లే కోసం అయినా లేదంటే కంటెంట్‌ సృష్టి కోసమైనా సరైన ల్యాప్‌టాప్‌ ఎంచుకోవడంలో వీరు సహాయపడతారు.ఈ నూతన ఫీచర్లను, మన్నిక శైలి, మెరుగైన ఎర్గోనామిక్స్‌ను ఈ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లో మా వినియోగదారులు అభిమానించగలరని నేను విశ్వసిస్తున్నాను’’ అని విజయ్‌ శర్మ, సేల్స్‌ హెడ్‌– కన్స్యూమర్‌ సౌత్‌ అండ్‌ వెస్ట్‌, లెనెవో ఇండియా అన్నారు.

ధర మరియు లభ్యత

లెనెవో యోగా 9ఐ, యోగా స్లిమ్‌ 7ఐ మరియు యోగా 7ఐ లు ఓట్‌మీల్‌, స్ట్రామ్‌ గ్రే, స్లేట్‌ గ్రే రంగులలో వరుసగా 1,69,990 రూపాయలు; 1,06, 990 రూపాయలు ; 1,14,990 రూపాయలలో లభ్యమవుతాయి.లెజియన్‌ 5ఐ, లెజియన్‌ 5ఐ ప్రో లు స్ట్రామ్‌ గ్రే కలర్‌లో మరియు లెజియన్‌ స్లిమ్‌ 7ఐ లు వరుసగా 1,44,990రూపాయలు ; 1,64,990 రూపాయలు మరియు 1,50,990 రూపాయలలో లభ్యమవుతాయి.

ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ 3ఐ మాత్రం ఓనిక్స్‌ గ్రే కలర్‌లో 84,990 రూపాయల ధరలో లభిస్తుంది.యోగా, లెజియన్‌, ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు లెనోవో డాట్‌ కామ్‌ మరియు లెనోవో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లలో విజయవాడ/విశాఖపట్నం /కొచిన్‌/తిరుచిరాపల్లిలో లభ్యమవుతాయి.

ల్యాప్‌టాప్‌లు పలు ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ మాధ్యమాలలో కూడా లభ్యమవుతాయి.

Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube