మొండి మొటిమ‌ల‌ను వ‌దిలించే నిమ్మ గడ్డి..ఎలా వాడాలంటే?

ఒక్కోసారి మొటిమ‌లు వ‌చ్చాయంటే.ఎన్ని చేసినా పోనే పోవు.

వీటినే మొండి మొటిమ‌ల‌ని అంటారు.

ఈ మొండి మొటిమ‌ల‌ను నివారించుకునేందుకు ఎంతో ఖ‌ర్చు పెట్టి క్రీములు కొనుగోలు చేసి వాడ‌తారు.

అయిన‌ప్ప‌టికీ.త‌గ్గ‌కుంటే ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తారు.

అప్ప‌టికీ త‌గ్గ‌క‌పోతే తెగ హైరానా ప‌డిపోయి మాన‌సికంగా కృంగిపోతారు.అయితే మొండి మొటిమ‌ల‌ను వ‌దిలించ‌డంలో నిమ్మ గ‌డ్డి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Lemongrass Helps To Reduce Pimples! Lemongrass, Reduce Pimples, Pimples, Benefit

నిమ్మ గ‌డ్డినే లెమ‌న్ గ్రాస్ అని కూడా అంటారు.ఈ లెమ‌న్ గ్రాస్ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని అంద‌రికీ తెలుసు.

అయితే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలోనూ నిమ్మ గ‌డ్డి ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు.

లెమ‌న్ గ్రాస్‌ను మెత్త‌గా పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోట అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే మొటిమ‌లు మ‌టు మాయం అవుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అలాగే ఫ్రెష్‌గా ఉండే లెమ‌న్ గ్రాస్ తీసుకుని మెత్త‌గా నూరు కోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు మొటిమ‌లు ఉన్న చోట ఈ మిశ్ర‌మాన్ని పూసి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మొండి మొటిమ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఇక లెమ‌న్ గ్రాస్ బ‌దులుగా లెమ‌న్ గ్రాస్ ఆయిల్ కూడా వాడుకో వ‌చ్చు.లెమ‌న్ గ్రాస్ ఆయిల్ తీసుకుని.అందులో దూదిని ముంచి మొటిమ‌లపై అద్దు కోవాలి.

ఇలా రాత్రి నిద్రించే ముందే ప్ర‌తి రోజు చేసి.ఉద‌యాన్నే గోరు వెచ్చిన నీటితో శుభ్రం చేసుకోవాలి.

త‌ద్వారా మొండి మొటిమ‌లు ప‌రార్ అవుతాయి.

తాజా వార్తలు