వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' వస్తే బాలయ్య 'మహానాయకుడు'ను పట్టించుకోరేమో, ఎందుకంటే..!

బాలకృష్ణ, క్రిష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సినిమా పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుని, నెగటివ్‌ వసూళ్లను రాబట్టింది.కథానాయకుడు సినిమా బాగానే ఉంది కాని, వివాదాలు లేక పోవడం వల్ల ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.

 Laxmis Ntr Coming Before Ntr Kathanayakudu-TeluguStop.com

ఎన్టీఆర్‌ సినిమాల గురించి చూసేందుకు సినిమా థియేటర్‌ వరకు వెళ్లాలా అని కొందరు పెదవి విరుస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే సినిమా చూసేందుకు జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టడం లేదు.

ఇక మహానాయకుడు పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అయితే ఈ గ్యాప్‌లోనే వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం కూడా రాబోతుంది.మొదట వర్మ తీసిన ఎన్టీఆర్‌ సినిమా తర్వాత, క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌ మహానాయకుడు రాబోతుంది.

ఈ రెండు సినిమాలు కూడా సేమ్‌ స్టోరీతో రాబోతున్నాయి.ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం గురించి దర్శకుడు క్రిష్‌ చూపించబోతున్నాడు.

వర్మ కూడా ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలోని ఒడిదొడుకులు మరియు లక్ష్మీ పార్వతి ఎంట్రీని చూపించబోతున్నాడు.

ఒకవేళ వర్మ తీస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా మొదట వచ్చి, అందులో వివాదాస్పద అంశాలు చాలా ఉంటే తప్పకుండా మంచి ఆధరణ దక్కించుకునే అవకాశం ఉంది.ఆ తర్వాత వచ్చే ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాలో ఎలాగూ వివాదాస్పద ఎలిమెంట్స్‌ ఉండవు.దాంతో పాటు పెద్దగా ఆసక్తికర ఎలిమెంట్స్‌ కూడా ఉండదు.

సాదా సీదాగా ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాన్ని సినీ జీవితం చూపించినట్లుగానే చూపించే అవకాశం ఉంది.దాంతో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తర్వాత రాబోతున్న ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాకు ఎన్టీఆర్‌ కథానాయకుడు కంటే కూడా దారుణమైన కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube