క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగపై రూ.200 కోట్ల దావా వేయనుంది శ్రీలంక క్రికెట్ బోర్డు.ఇటీవల క్రికెట్ పరిస్థితులపై మాజీ సారథి రణతుంగ చేసిన వ్యాఖ్యలపై ఎస్ఎల్సీ మండిపడుతుంది.ఈ మేరకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని ఎస్ఎల్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
క్రికెట్ లోని సుహృద్భావపూరిత వాతావరణాన్ని దెబ్బతీసేలా, రణతుంగ ఉద్దేశ పూర్వకంగా క్రికెట్ బోర్డుపై ద్వేష భావనలు గుప్పించారని ఆరోపించింది.







