సూర్యాపేట జిల్లా:భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో రక్తదాతలు ముందుకొచ్చి రక్త దానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు.బుధవారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్,మున్సిపల్ చైర్ పర్సన్ పి.
అన్నపూర్ణ లతో కలసి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో రెండు సార్లు రక్తదానం చెలయాలని ఆపదలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడినవారవుతారని అన్నారు.
స్థానిక జనరల్ ఆసుపత్రి,కోదాడ హుజూర్ నగర్,తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 300 వందలకు పైగా రక్త దాతలు ముందుకొచ్చి రక్తాన్ని అందించారని,వైద్యులతోపాటు ప్రతి ఒక్కరినీ ఈ సందర్బంగా అభినదించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస గౌడ్,జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డా.కోటాచలం,ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రెడ్డి, వైద్యులు,జిల్లా అధికారులు,పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.