విడిపోయిన భార్య భర్తలను ఒక్కటి చెయ్యబోతున్న లావణ్య త్రిపాఠి..!

రీసెంట్ గానే టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి( Lavanya tripathi, Varun tej ) ఇటలీ లో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ జంట పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

 Lavanya Tripathi Is Going To Unite The Chaitanya Jonnalagadda Chaitanya Detai-TeluguStop.com

లావణ్య త్రిపాఠి మెగా కుటుంబం లోకి అడుగుపెట్టిన వేళా విశేషం, ఆ కుటుంబం లో ఉన్నవాళ్ళందరికీ మంచే జరుగుతుంది.రామ్ చరణ్ కి కూతురు పుట్టడం, చిరంజీవి కి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ రావడం జరిగాయి.

కేవలం ఇదే కాదు విడిపోయిన భార్య భర్తలను కూడా ఆమె కలిపే ప్రయత్నం లో ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది.వరుణ్ తేజ్ తో కంటే ముందే లావణ్య త్రిపాఠికి ఆయన చెల్లెలు నిహారిక కొణిదెల బెస్ట్ ఫ్రెండ్.

వీళ్ళిద్దరూ కలిసి ప్రైవేట్ పార్టీలు, జిమ్ మరియు టూర్స్ చేసుకునేవారు.

Telugu Naga Babu, Tollywood, Varun Tej-Movie

అలా నిహారిక ద్వారా వరుణ్ తేజ్ తో పరిచయం ఏర్పడి మిస్టర్ సినిమా( Mister movie )లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ఆ సినిమా సమయం లో మంచి స్నేహితులుగా మారిన వరుణ్ తేజ్ – లావణ్య, అంతరిక్షం సమయానికి ప్రేమలో పడ్డారు.అలా ప్రారంభమైన వీళ్లిద్దరి రిలేషన్ పెళ్లి కార్డు తో శుభం పడింది.

కానీ నిహారిక మాత్రం తన జీవితం ని నాశనం చేసుకుంటుంది అనే బాధ లావణ్య లో ఉందట.ఆమె కెరీర్ ని చక్కబెట్టడం ఒకటే కాకుండా, ఆమె వైవాహిక జీవితం ని కూడా సరిచేసే పనిలో పడిందట.

ఈమె లాక్ డౌన్ తర్వాత చైతన్య అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే.కొన్నాళ్ళు వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఆయా తర్వాత ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణం గా విబేధాలు వచ్చి విడిపోయారట.

ప్రస్తుతం నిహారిక మణికొండ ప్రాంతం లోని ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది.

Telugu Naga Babu, Tollywood, Varun Tej-Movie

ఇదంతా పక్కన పెడితే నిహారిక కి నచ్చచెప్పి మళ్ళీ చైతన్య తో( Chaitanya Jonnalagadda ) కలిసిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తుందట.చైతన్య ఈమెతో మళ్ళీ కలిసేందుకు సిద్దంగానే ఉన్నప్పటికీ, నిహారిక మాత్రం సిద్ధంగా లేదట.ప్రస్తుతం ఈ ప్రేమ పెళ్లి పై తనకి ఆసక్తి లేదని, ముందుగా నా కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి అని, త్వరలోనే సినిమాల్లో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాలి అని లావణ్య తో చెప్పిందట.

ఆమె కూడా అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.రీసెంట్ గానే నిహారిక ఒక కొత్త సినిమాని ప్రారంభించడం, దానికి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ముఖ్య అతిథులుగా రావడం వంటివి చూసాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube