అందరూ నెంబర్ వన్ అనేది అసాధ్యం.. లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

 Lavanya Tripathi Happy Birthday Movie Interview Details, Lavanya Tripathi, Happy Birthday Movie, Tollywood, Interesting Comments, Lavanya Tripathi Interview, Lavanya Tripathi Cine Career, Andala Rakshasi Movie, Lavanya Tripathi Comments-TeluguStop.com

మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక హీరోయిన్ గా తన పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలని,పరాజ్యాలని ఎదుర్కొంది.

ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి నటించిన తాజా చిత్రం హ్యాపీ బర్త్ డే.ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు.

 Lavanya Tripathi Happy Birthday Movie Interview Details, Lavanya Tripathi, Happy Birthday Movie, Tollywood, Interesting Comments, Lavanya Tripathi Interview, Lavanya Tripathi Cine Career, Andala Rakshasi Movie, Lavanya Tripathi Comments-అందరూ నెంబర్ వన్ అనేది అసాధ్యం.. లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని రవిశంకర్ ఎలమంచిలి సమర్పణలలో చిరంజీవి, హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు.కాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన లావణ్య త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది లావణ్య త్రిపాఠి.

హ్యాపీ బర్త్ డే సినిమా ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా.ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.

ఇందులో నేను హ్యాపీ అనే పాత్ర చేశాను.

హ్యాపీ బర్త్ డే కథ కీలకంగా ఉంటుంది అని తెలిపింది.

ఇక పదేళ్ల కెరీర్లో టాప్ లీడ్ లోకి చేరుకోలేదు అన్న భావన ఉందా అని అడగగా.

పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను అదే గొప్ప ఆనందం.ఇక అందరూ నెంబర్ వన్ కి వెళ్లాలని ఉండదు కదా.నా వర్క్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఎలాంటి ఒత్తిడి తీసుకోను.మనసుకు నచ్చిన పాత్రలు చేస్తుంటాను.హ్యాపీ పాత్ర కూడా అలాగే అద్భుతంగా ఉంటుంది నా ప్రయాణం సంతృప్తికరంగా ఉంది అని తెలిపింది లావణ్య త్రిపాఠి.హ్యాపీ బర్త్ డే సినిమాలో సినీ హీరో ఎవరు అని అడగగా.ఈ సినిమా విమెన్ సెంట్రిక్ సినిమా కాదు.

ఇందులో పాత్రలన్నీ హీరోలే.క్యారెక్టర్ బేస్డ్ కథ ఇది అని తెలిపింది.

ప్రస్తుతం ఏమైనా సినిమాలలో నటిస్తున్నారా అని అడగగా.తమిళంలో అథర్వ తో ఒక సినిమాలో నటిస్తున్నాను అని తెలిపింది లావణ్య త్రిపాఠి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube