లావా O2 స్మార్ట్ ఫోన్( Lava O2 Smartphone ) త్వరలో భారత మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.ఈ హ్యాండ్ సెట్ అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది.
అమెజాన్ ల్యాండింగ్ పేజీ( Amazon ) ద్వారా ఈ హ్యాండ్ సెట్ వివరాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.అవి ఏమిటో చూద్దాం.ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది.ఈ ఫోన్ ముందు వైపు పంచ్ హోల్ డిజైన్ ను కలిగి ఉంది.వెనుకవైపు AG గ్లాస్ తో వస్తుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పై పని చేస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 18w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ అక్టా కోర్ Unisoc T616 చిప్ సెట్( Octacore Unisoc T616 ) ను కలిగి ఉంటుంది.ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x RAM,128GB UFS 2.2 తో జత చేయబడి ఉంటుంది.ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.50ఎంపీ AI డ్యూయల్ కెమెరాలతో వస్తుంది.సెల్ఫీల కోసం, వీడియోల కోసం 8ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ స్కానర్( Side Mounted Finger Scanner ) ను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ వీడియో ఆధారంగా హ్యాండ్ సెట్ కింది భాగంలో USB-C చార్జింగ్ పోర్టుతో పాటు స్పీకర్ గ్రిల్ ను అమర్చారు.ఈ ఫోన్ వెనుక వైపు లావా లోగో ఉంటుంది.
ఈ ఫోన్ ను చూసే యాంగిల్ ను బట్టి కెమెరా మాడ్యూల్ వివిధ రకాలుగా కనిపిస్తుంది.త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ అవ్వనుంది.