అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్,( Donald Trump ) డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్‌లు( Kamala Harris ) ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఇటీవల ముగిసిన రెండవ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ పైచేయి సాధించడంతో రిపబ్లికన్లు రగిలిపోతున్నారు.ఈ డిబేట్‌కు హోస్ట్‌లుగా వ్యవహరించిన మూరీ, డేవిస్‌లపై ట్రంప్ కుమారుడు ఆరోపణలు చేశారు.
పక్షపాతంగా వ్యవహరించిన ఏబీసీ ఛానెల్‌ని నిషేధించాలని మిస్సోరి సెనేటర్ ఎరిక్ స్కిమ్మిట్ డిమాండ్ చేశారు.ఏబీసీ హోస్ట్‌లు కమలా హారిస్ అబద్ధాలు చెప్పినా ఏమి మాట్లాడలేదని మండిపడ్డారు.
ఇదిలాఉండగా.కమలా హారిస్‌పై ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్( Laura Loomer ) జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.ముఖ్యంగా ఆమె భారతీయ మూలాలను లారా టార్గెట్ చేశారు.ఇటీవల తాను చిన్నతనంలో భారత్‌లో తన అమ్మమ్మ, తాతయ్యలతో గడిపిన ఫోటోలను కమలా హారిస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చెన్నై బీచ్‌లో మార్నింగ్ వాక్‌కి తీసుకెళ్లిన తన తాతయ్య ఎన్నో విషయాలు చెప్పేవారని కమల ప్రస్తావించారు.దీనిపై స్పందించిన లారా లూమర్.కమలా హారిస్ అధ్యక్షురాలిగా గెలిస్తే వైట్‌హౌస్( White House ) కరివేపాకులా ఉంటుందన్నారు.వైట్‌హౌస్ ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా చేస్తారంటూ ఆమె ఎద్దేవా చేశారు.
దీనిపై రిపబ్లికన్ నేత, ప్రతినిధుల సభ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్( Marjorie Taylor Greene ) ఘాటుగా స్పందించారు.ఇది జాత్యహంకారమని.దీనిని రిపబ్లికన్లు, మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఎవరూ సూచించరని టేలర్ అన్నారు.ఇలాంటి వాటిని ట్రంప్ ప్రాతినిథ్యం వహించరని, ఈ రకమైన ప్రవర్తనను సహించకూడదని సదరు పోస్ట్‌ని లారా సహించకూడదని ఆమె కోరారు.
చాలామంది నెటిజన్లు సైతం కామెంట్ సెక్షన్‌లో లారా లూమర్‌పై విరుచుకుపడ్డారు.మీరు ట్రంప్‌కు అస్సలు సహాయం చేయడం లేదని, ట్రంప్ ఓడిపోవడానికి దారితీసే కారణాలలో ఇది కూడా ఒకటన్నారు.