పుష్ప 2 లో మళ్ళీ క్రేజీ కాంబో.. షేక్ చేయడానికి సిద్ధం!

పాన్ ఇండియా దగ్గర అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్”( Pushpa the Rule ) ఒకటి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.

 Latest Update On Pushpa 2 , Pushpa The Rule, Pushpa 2, Allu Arjun, Sukumar, Rash-TeluguStop.com

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.

అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ఇక తాజాగా ఈ సినిమాలో మరో క్రేజీ కాంబో రిపీట్ కాబోతుంది అని కన్ఫర్మ్ అయ్యింది.ఫస్ట్ పార్ట్ లో పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పాల్సిన పని లేదు.

బన్నీ వేసిన హుక్ స్టెప్స్ అన్ని ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు చేర్చాయి.

ఆ హుక్ స్టెప్స్ అండ్ సాంగ్స్ లో శ్రీవల్లి సాంగ్ ఒకటి.ఈ సాంగ్ ను ప్రముఖ డైరెక్టర్ జానీ మాస్టర్ ( Johnny master )కొరియోగ్రాఫ్ చేసాడు.మరి ఇప్పుడు పార్ట్ 2 లో కూడా మళ్ళీ జానీ మాస్టర్ భాగం అయినట్టు తాజా పోస్ట్ తో కన్ఫర్మ్ చేసాడు.

రీసెంట్ గా జానీ మాస్టర్ సుకుమార్ ను కలువగా దీనిపై పోస్ట్ చేస్తూ తమ సాంగ్ కోసం కూడా వెయిట్ చెయ్యండి అంటూ చెప్పడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.

దీన్ని బట్టి పార్ట్ 2 లో కూడా క్రేజీ సాంగ్ తో పాటు హుక్ స్టెప్స్ కూడా అదిరిపోతాయని అర్ధం అవుతుంది.ఈ అప్డేట్ తో పుష్పరాజ్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు.చూడాలి ఈ కాంబో ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో.

కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube