సలార్ క్రేజీ అప్డేట్.. కెరీర్ లోనే బెస్ట్ లుక్ లో డార్లింగ్!

పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

 Latest Update On Prabhas Salaar, Prabhas, Salaar, director Maruthi, Prashanth N-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఈయన భారీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

ఈయన నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.ఇండియన్ మార్కెట్ దగ్గర భారీ క్రేజ్ మాత్రమే కాదు బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ముందు వరుసలో ఉంది.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉండగా ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

సలార్ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్ లో కనిపిస్తాడట.మెయిన్ గా సెకండాఫ్ లో వచ్చే మాసివ్ లుక్ లో ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.అంతేకాదు ఈయన కెరీర్ లోనే సరికొత్త లుక్ గా ఈ సినిమాలో లుక్ నిలిచి పోతుందని నీల్ ఆ స్థాయిలో ప్రభాస్ లుక్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.మరి ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube