పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.కానీ ఆ సినిమాలను మాత్రం పూర్తి చేయడం లేదు.
సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో వరుస హిట్ లు కొట్టిన పవన్ ఆ తర్వాత మాత్రం మరో సినిమాను పూర్తి చేయలేక పోయాడు.ఈయన హరిహర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేసి 60 శాతం పూర్తి కూడా చేసాడు.
కానీ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో ఈ సినిమ గత కొన్ని నెలలుగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయలేదు.క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.
కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ పై ఒక క్రేజీ అప్డేట్ తెలుస్తుంది.
ఈ సినిమాలో ప్రెజెంట్ మేకర్స్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పటి నుండో టాక్ వస్తుంది.పవన్ కూడా అందుకు సిద్ధం అయ్యాడు.
అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ పై లేటెస్ట్ గా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఒక్క యాక్షన్ బ్లాక్ కోసమే 8 నుండో 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు టాక్.

అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్ అన్ని కూడా పవన్ ముందు లుక్ లో కాకుండా కొత్త లుక్ లో ఉంటాయట.ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు ఈ సినిమాకే హైలెట్ గా తెరకెక్కించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమాను పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.







