నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా హీరోయిన్గా నిర్మాతగా కొనసాగుతున్నటువంటి ఈమె ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలు వెబ్ సిరీస్లో నిర్మిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమార్తెగా ఈమె బుల్లితెరపై యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తన మాట తీరుతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు.యాంకర్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమెకు ఏకంగా హీరోయిన్గా సినిమాలలోకి అడుగు పెట్టారు.
అయితే ఈమెను హీరోయిన్గా వెండి తెరపై చూడటానికి మెగా అభిమానులు ఇష్టపడలేదు.
ఇలా హీరోయిన్గా నిహారిక( Niharika ) పలు సినిమాలలో నటించిన ప్రేక్షకుల మాత్రం ఈమెను ఆదరించలేకపోవడంతో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.
దీంతో కుటుంబ సభ్యులు ఈమెకు జొన్నలగడ్డ వెంకట చైతన్య (Venkata Chaitanya) అనే అబ్బాయికి ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేశారు.ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పాలి.
వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయి ప్రస్తుతం ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నారు.ఇక భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పలు వెబ్ సిరీస్ లలో నటించిన కాకుండా నిర్మాతగా కూడా పలు సిరీస్ లు నిర్మించారు .ఇలా నిర్మాతగా సక్సెస్ అయినటువంటి నిహారిక ప్రస్తుతం సినిమాలకు కూడా నిర్మాతగా( Producer ) వ్యవహరిస్తున్నారు.నిహారిక అన్ని విషయాలలోనూ చురుగ్గా పాల్గొంటారనే సంగతి మనకు తెలిసిందే.ఈమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిహారికకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నలకు ఈమె చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిహారికకు మీరు ఫస్ట్ టైం ఎప్పుడు మేకప్ వేసుకున్నారు అంటూ ప్రశ్న ఎదురుగా తాను ఢీ షో(Dhee Show) కే మొదటి మేకప్ వేసుకున్నానని ఈమె తెలియజేశారు.ఈ షో నాకు ఎప్పటికీ మెమొరబుల్ అంటూ ఈమె కామెంట్ చేశారు.మీరు చిన్నప్పుడు ఏవైనా విలువైన ఖరీదైన వస్తువులను పోగొట్టుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయా అని అనడంతో పోగొట్టుకోవడమా ఆ విషయంలో మనమే ముందుంటాము అంటూ నిహారిక సమాధానం చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
చిన్నప్పుడు అమ్మ( Niharika Mother ) తనకోసం ఎన్నో రకాల డిజైన్స్ నగలను తెచ్చి పెట్టేది.నేను వాటిని చాలా ఎక్కువగా పోగొట్టానని ఈ సందర్భంగా నిహారిక తెలిపారు.చిన్నప్పుడు చాలా బంగారం పోగొట్టుకున్నానని నేను పోగొట్టుకున్న బంగారం(Gold)తో ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిన్నప్పుడు నాకు పెద్దగా తెలిసేది కాదని అసలు నేను పెట్టుకున్న నగలు ఉన్నాయో లేదో కూడా గమనించుకునే దానిని కాదు అంటూ ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు.ఇలా తాను పోగొట్టుకున్న బంగారంతో ఇల్లు కట్టుకోవచ్చు అంటూ ఈమె కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.