సింగర్ గీత మాధురి కొడుకుకి తారక్ అని పేరు పెట్టడం వెనుక ఇంత స్టోరీ ఉందా?

సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాక్టర్ నందు( Actor Nandu ) ఒకరు ఈయన హీరోగా కాకుండా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలోను లేదంటే సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.ఇక ఇటీవల కాలంలో నందు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Latest News About Singer Geetha Maduri Son Details, Singer Geetha Madhuri, Son,-TeluguStop.com

ఇక ఈయన సింగర్ గీత మాధురి( Geetha Madhuri ) ని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే.

వీరికి మొదట పాప జన్మించగా ఇటీవల గీత మాధురి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చారు.

ఇలా గీత మాధురి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు తన బేబీ షవర్ వేడుకలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇక తనకు కుమారుడు పుట్టారని శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్నారు.అయితే తన కుమారుడికి ధృవ ధీర్ తారక్( Dhruvadheer Tarak ) అనే పేరు పెట్టినట్లు గీత నందు ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Telugu Nandu, Jr Ntr, Nandugeetha, Nandu Son, Geetha Madhuri, Tarak, Tollywood-M

ఇలా తన కుమారుడి పేరులో ఎన్టీఆర్( NTR ) పేరులోని ఒక భాగమైనటువంటి తారక్( Tarak ) అని ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే తన కుమారుడి పేరులో తారక్ అని పేరు పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనే విషయం గురించి ఇటీవల నందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Nandu, Jr Ntr, Nandugeetha, Nandu Son, Geetha Madhuri, Tarak, Tollywood-M

తన కొడుకు పేరులో తారక్ పెట్టడానికి పెద్దగా కారణాలు లేవని తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.అంతేకాకుండా తారక్ అనే పేరులోనే ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుంది ఆపేరంటే నాకు చాలా ఇష్టం అని తెలిపారు.అంతేకాకుండా ఈ ఏడాది అయోధ్యలో బాలరామయ్య( Ayodhya Balaramayya ) కొలువై ఉన్నారు.అలాగే మా ఇంటికి కూడా ఈ బాబు రావడంతో సాక్షాత్తు బాల రాముడే మా ఇంటికి వచ్చారన్న ఉద్దేశంతో తారక రాముడు అనే పేరు కలిసొచ్చేలా తన కుమారుడికి తారక్ అనే పేరును పెట్టామని ఈ సందర్భంగా నందు తెలిపారు.

Telugu Nandu, Jr Ntr, Nandugeetha, Nandu Son, Geetha Madhuri, Tarak, Tollywood-M

ఇక తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం నటన పరంగా ఆయన తన ఫేవరెట్ హీరో అని తెలిపారు.అంతేకాకుండా తారక్ అనే పేరు కూడా తనకు చాలా ఇష్టం కావడంతోనే తన కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నామని ఈయన తెలియజేయడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ తప్పకుండా ఎన్టీఆర్ అలాగే ఎన్టీఆర్ అభిమానుల ఆశీస్సులు మీ బిడ్డపై ఎప్పుడూ ఉంటాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube