Pragathi : ఇంట్లో ప్రత్యేక హోమం చేయించిన నటి ప్రగతి… అందుకోసమే చేయించారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రగతి ( Pragathi ) ఒకరు.

ఈమె ప్రగతి ఆంటీగా ఎంతో ఫేమస్ అయ్యారు.

ప్రగతి వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.కెరియర్ మొదట్లో ఈమె పలు తమిళ సినిమాలలో హీరోయిన్గా నటించిన అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.

ప్రగతి ఎక్కువగా అమ్మ పాత్రలలోనే నటించేది.అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఈమె నిలిచారు.

ఇలా ఇప్పటికి పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

Advertisement

ఇక ప్రగతి ఈమధ్య కాలంలో ఫిట్నెస్ పై భారీగా ఫోకస్ చేశారు.ఫిట్నెస్ కోసం ఈమె నాలుగు పదుల వయసులో కూడా జిమ్ ( Gym ) లో భారీ స్థాయిలో వర్కౌట్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు.అందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంటారనే సంగతి మనకు తెలిసిందే.

ఇలా వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెరపై కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి ఊర్వశివో రాక్షసివో అని బుల్లితెర సీరియల్లో ప్రగతి కీలకపాత్రలో నటించారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సీరియల్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది .ఇలా వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి ఈమె ఇటీవల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా ఈమె తన ఇంటి ఆవరణంలో పెద్ద ఎత్తున హోమం చేశారని తెలుస్తోంది.

ఇలా ఈమె ప్రత్యేక పూజలు పాల్గొని హోమం నిర్వహించడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.అసలు ఈమె ఇలా హోమం చేయడానికి గల కారణం ఏంటి అంటూ నెటిజన్స్ ఆరాతీస్తున్నారు.ఇలా ఈమె ఈ హోమం చేస్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ ఏడాదిలో తనకు జరిగినటువంటి మంచికి కృతజ్ఞతలు తెలియజేశారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా అందరికీ చాలా మంచి కలగాలని కూడా కోరుకున్నారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియో పై అభిమానులు నేటిజన్స్ యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు