సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి సక్సెస్ అయ్యారు.ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో కూడా ప్రభాస్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.త్వరలోనే ప్రభాస్ కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో కూడా ప్రభాస్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక ఈయన నటించినటువంటి బాహుబలి( Bahubali ) సినిమా ఈయన కెరియర్ కు మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి ఈ సినిమాలో బాహుబలి గా ఎలాంటి సమస్యనైనా ఎంతో అవలీలగా ఎదుర్కొని పరిష్కరించే ప్రభాస్ ఒక చిన్న జీవికి భయపడతారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.
ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు.అయితే తనకు దేనిని చూస్తే ఎక్కువగా భయం వేస్తుందనే ప్రశ్న తనకు ఎదురయింది.ఈ ప్రశ్నకు ప్రభాస్ సమాధానం చెబుతూ తనకు చూసిన వెంటనే భయం చూడగానే భయం కలిగించేది ఏదైనా ఉంది అంటే అది బల్లి (Lizard) మాత్రమేనని ప్రభాస్ తెలిపారు.
తాను పాము నైనా పట్టుకుంటాను ఇతర దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటాను కానీ బల్లిని చూస్తే మాత్రం నాకు చాలా భయం అని, బలిని చూడగానే ఏదో తెలియని కంగారు తనలో ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.డైనోసార్ బల్లికి భయపడటం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేయగా.బాహుబలి బలికి భయపడతారని చెబుతూ పరువు తీస్తున్నావు కదా డార్లింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన నటించిన సినిమాల విషయానికి వస్తే కల్కి సినిమా మే 30వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు స్పిరిట్,రాజా సాబ్ వంటి సినిమాలలో కూడా ప్రభాస్ నటిస్తే బిజీగా ఉన్నారు.