రీతూ చౌదరి( Reethu Chowdary ) పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కూడా సందడి చేశారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండడం లేదని చెప్పాలి.
ఇలా రీతూ చౌదరి సోషల్ మీడియాలో విష్ణు ప్రియ ( Vishnu Priya ) తో కలిసి చేసే హంగామా అలాగే ఉంటుంది అదేవిధంగా తన తల్లితో కలిసి ఇటీవల కాలంలో ఈమె పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే రీతూ చౌదరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్లను చేస్తూ ఉంటారు చిన్న చిన్న దుస్తులను ధరించి అందాలన్నింటిని ఆరబోయడంతో ఈమె పట్ల నెగిటివ్ కామెంట్లు చేసే వారి సంఖ్య కూడా అధికమైంది.
ఇలా భారీ స్థాయిలో ఈమెను ట్రోల్ చేసేవారు.ఇలా తరచూ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ అందాలన్నింటిని ఆరబోసే ఈమే తాజాగా చీరకట్టులో ( Saree ) కనిపించారు.
దీంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అచ్చం ఏం మాయ చేసావే సినిమాలో సమంత చీర కట్టులో ఏ విధంగా అయితే నడుస్తూ వస్తుంటారో అదేవిధంగా ఈమె కూడా చీర కట్టుకొని రోడ్డుపై అలా నడుస్తూ వచ్చారు.ఈ వీడియోకి జిలిబిలి పలుకుల అనే పాటను జత చేశారు.ఇలా చీరకట్టులో రోడ్డుపై నడుస్తూ కూరగాయలు కొంటూ ఉన్నట్టు ఈ వీడియోలో కనిపించారు.

ఇక ఈ వీడియో పై ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేశారు.ఒక నెటిజన్ అయితే హమ్మయ్య మొత్తానికి నిండా దుస్తులు ధరించావు అంటూ దారుణమైనటువంటి కామెంట్ చేశారు.అలాగే మరికొందరు ఏ మాయ చేసావో సినిమా పాట కనుక పెట్టి ఉంటే బాగా సెట్ అయ్యేది అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇలా చీర కట్టుకొని ఉంటే చాలా పద్ధతిగా అందంగా ఉన్నావు ఎప్పుడు ఇలాగే ఉండొచ్చుగా అంటూ మరికొందరు కూడా ఈమె ఈ వీడియో పై నేటిజన్స్ కామెంట్ చేయడం గమనార్హం.







