ఉత్తరాది రాష్ట్రాల నుంచి హీరోయిన్ గా దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) ఒకరు.ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా వచ్చారు.
మొదటి సినిమాతోనే తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి లావణ్య త్రిపాఠి అనంతరం వరుసగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకున్నారు.ఈ విధంగా లావణ్య త్రిపాఠి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.
ఇలా నార్త్ నుంచి సౌత్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ఏకంగా తెలుగింటి కోడలు అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అయ్యారు.

ఈమె మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) తో కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమాల సమయంలోనే ఆ హీరోతో ప్రేమలో పడినటువంటి సంవత్సరాల పాటు తన ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు.ఇక వీరిద్దరి ప్రేమ విషయం గురించి సోషల్ మీడియా( Social Media )లో వార్తలు వచ్చిన కూడా వీరు వాటిని ఖండించారు తప్ప తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు.
అయితే చివరికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నిశ్చితార్థం చేసుకోబోతున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు.ఇక ఈ జంట గత ఏడాది నవంబర్ 1వ తేదీ ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక లావణ్య త్రిపాటి పెళ్లి( Lavanya Tripathi Marriage ) తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది ఈమె సినిమాలలో నటించడానికి మెగా ఫ్యామిలీ ఏ విధమైనటువంటి అభ్యంతరాలు తెలపకపోవడంతో ఈమె తిరిగి ఇండస్ట్రీలో హీరోయిన్గా నటించబోతున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈమె యూవీ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇలా తెలుగింటి అమ్మాయిగా అడుగు పెట్టినటువంటి లావణ్య త్రిపాఠి కెరియర్ పరంగా బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా మట్టితో కొన్ని వస్తువులను( Clay Utensils ) తయారు చేసి ఉన్నటువంటి ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసారు.అయితే ఈ బొమ్మలన్నింటినీ తానే చేశానని ఈమె చెప్పకు వచ్చారు.ఇలా మట్టితో ఎంతో అందంగా ఈమె ఈ బొమ్మలను తయారు చేయడంతో లావణ్య త్రిపాఠిలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా చాలా క్యూట్ గా తయారు చేసింది అంటూ పలువురు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.