ఇటీవల కాలంలో జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ( Venu Swamy ) ఒకరు.ఈయన గత కొంతకాలంగా జ్యోతిష్యం చెబుతూ ఉన్నారు కానీ ఇటీవల ఈయన ఎంతో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే .
ఎప్పుడైతే వేణు స్వామి సమంత నాగచైతన్య జాతకం గురించి చెప్పారో ఆ క్షణం ఈయన వార్తలలో నిలిచారు.అయితే సమంత నాగచైతన్య విడిపోతారని ఈయన చెప్పడంతో అభిమానులు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు కానీ ఈయన చెప్పినదే నిజం కావడంతో అందరూ ఈయనని నమ్మేవారు.
ఇలా ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ఈయన సినిమా సెలబ్రిటీలకు ( celebrities )సంబంధించిన విషయాలతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.ఇకపోతే వేణు స్వామి జాతకాలను చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు దీంతో ఈయన పట్ల విమర్శలు కూడా చేస్తుంటారు.అందరి జాతకాలు చెప్పే వేణు స్వామి జాతకం బాగాలేకనే ఇలా జాతకాలు చెబుతూ బ్రతుకుతున్నారు అంటూ ఈయన పట్ల విమర్శలు కూడా చేశారు.ఇలా తన గురించి వచ్చినటువంటి ఈ విమర్శల పట్ల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడారు.
నా జాతకమే బాగుంటే ఎందుకు జాతకాలు చెప్పుకుంటాడు అంటూ చాలామంది నన్ను విమర్శించారు అయితే నాకు ఇది మాత్రమే జీవనాధారం కాదు నాకు చాలా బిజినెస్ లో ఉన్నాయి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తానని వేణు స్వామి చెప్పారు.అయితే నేను ఈ వ్యాపారాలు చూసుకుంటూ మరోవైపు నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ ఉంటాను.
అలాగే చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు జాతకాలు, పరిహారాలు చేస్తూ బిజీగా గడుపుతానని తెలిపారు.
ఇక వేణు స్వామి చేత జాతకం చెప్పించుకోవాలి అంటే ఆషామాషి కాదని, కొన్ని నెలల ముందు ఈయన దగ్గర అపాయింట్మెంట్( appointment ) తీసుకొని జాతకం చెప్పించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.తన అపాయింట్మెంట్ నెంబర్ కనుక ఇస్తే తన టీం ఎప్పుడు వారికి జ్యోతిష్యం చెబుతారనే విషయాల గురించి సమాచారం ఇస్తారని వేణు స్వామి తెలిపారు.ఇక నేను నా వ్యక్తిగత విషయాలు వ్యాపారాలు చూసుకుంటూ ఉండటం వల్ల ఇంత బిజీగా ఉన్నానని అందుకే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని వేణు స్వామి తెలిపారు.
ఇలా ఒక జ్యోతిష్యుడు దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి కొన్ని నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.అయితే మరికొందరు ఈ వీడియో పై జోక్ చాలా బాగుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా ఫేక్ జ్యోతిష్యుడు అంటూ మరికొందరు ఈయన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.