Suma Kanakala : కొడుకు సినిమా కోసం తెగ కష్టపడుతున్న సుమక్క… ఎప్పుడు చెయ్యని పనులు చేస్తూ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ( Suma Kanakala ) ముందు వరుసలో ఉంటారని చెప్పాలి.టాలీవుడ్ యాంకజిలేబి సాంగ్ ర్ అంటేనే అందరికీ టక్కున సుమ పేరు గుర్తుకు వస్తుంది .

 Latest News About Anchor Suma Kanakala-TeluguStop.com

సుమ తన యాంకరింగ్ ద్వారా గుర్తింపు పొందారని చెప్పాలి.తన మాటతీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నటువంటి సుమ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.

ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమా వేడుకలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలా వారంలో ఏడు రోజులపాటు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.ఇకపోతే సుమ తాజాగా తన కుమారుడు రోషన్ ( Roshan ) కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు.సుమ రాజీవ్ కనకాల ( Rajeev Kanakala ) ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే తమ వారసుడిగా తన కుమారుడు రోషన్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు.ఈ క్రమంలోనే తన కొడుకుని త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.

ఇప్పటికే ఈయన బబుల్ గమ్ ( Bubble Gum ) అనే సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే సుమ ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా తన కొడుకుని వెంటపెట్టుకొని మరి వెళ్తూ హైలెట్ చేస్తున్నారు.వరుణ్ తేజ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కూడా సుమా తన కుమారుడి రోషన్ తో కలిసి హాజరయ్యారు.

ఇలా త్వరలోనే తన కుమారుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నటువంటి నేపథ్యంలో తన కొడుకు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా సుమా తన భుజాలపై వేసుకున్నారు.తన కొడుకు సినిమా నుంచి విడుదలైన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ పాటకు సుమ డాన్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.

సుమ పెద్దగా డాన్స్ చేయరు అనే విషయం మనకు తెలిస్తే కానీ తన కుమారుడి సినిమా కోసం ఈమె డాన్సులు చేస్తూ కూడా కష్టపడుతున్నారు.అయితే ఇంస్టాగ్రామ్( Instagram ) వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా జిలేబి అనే పాటకు డాన్స్ చేశారు.ఈ వీడియోలో తన అసిస్టెంట్లను ఈమె పక్కన పెట్టుకొని డాన్స్ చేశారు అయితే వీరు సుమ కన్నా చాలా ఘోరంగా డాన్స్ చేయడం గమనార్హం.

ఈ డాన్స్ వీడియో వైరల్ గా మారడంతో ఎంతో మంది పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ముసలమ్మ అయిపోయావు సుమక్క అంటూ కొందరు కామెంట్లు చేయగా మీకు బాగా తెలివి ఎక్కువ మీ కన్నా డాన్స్ బాగా రాని వారిని పక్కన పెట్టుకొని మీరే డాన్స్ బాగా చేశారు అనిపించుకునేలా చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక మరి కొంతమంది అయితే సుమని భారీగానే టార్గెట్ చేశారు.గత కొద్ది రోజుల క్రితం సుమ మీడియా వారిని ఉద్దేశించి స్నాక్స్ కూడా భోజనం లాగా చేస్తున్నారు అంటూ నోరు జారిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ విషయంపై మీడియా వారికి సుమ వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పారు.అయితే ఈ వీడియో పై కొంతమంది డాన్స్ డాన్స్ లాగా చేయి స్నాక్స్ లాగా చెయ్యొద్దు అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా కొడుకుని ఇండస్ట్రీలో నిలబెట్టడం కోసం తల్లిగా సుమక్క భారీగానే కష్టపడుతున్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube