మైక్రోసాఫ్ట్ తాజాగా విండోస్ 11( Windows 11 ) కి అప్డేట్ ను రిలీజ్ చేసింది.ఈ అప్డేట్ తో విండోస్ 11 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్లు ఏమిటో చూద్దాం.
కోపైలట్ ఇంటిగ్రేషన్:
విండోస్ 11 అప్డేట్ తో కోపైలట్ ఇంటిగ్రేషన్ ను పరిచయం చేసింది.కోపైలట్ ఇంటిగ్రేషన్ ను ఆపరేటింగ్ సిస్టం అంతట సైడ్ బార్ గా యాక్సిస్ చేయవచ్చు.
ఈ ఫీచర్ మల్టీ టాస్కింగ్ ను క్రమబద్ధీకరిస్తుంది.టాస్క్ ను కంప్లీట్ చేస్తుంది.Win+C షార్ట్ కట్ ద్వారా ఈ ఫీచర్ ని ఉపయోగించవచ్చు.
స్నిప్పింగ్ టూల్ టెక్స్ట్ ఎక్స్ ట్రాక్షన్:
ఈ ఫీచర్ ఇమేజ్ నుంచి స్పెసిఫిక్ టెక్స్ట్ కంటెంట్ ను ఎక్స్ ట్రాఫ్ట్ చేయగలదు.

క్లిప్ చాంప్ ఆటో-కంపోజ్ ఫీచర్:
ఇది ఒక వీడియో ఎడిటింగ్ టూల్.వీడియో క్రియేషన్ ప్రాసెస్ ని సులభతరం చేస్తూ ఈ ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసింది.
టెక్స్ట్ ఆథరింగ్:
వాయిస్ యాక్సెస్ కోసం టెక్స్ట్ ఆథరింగ్ ఎక్స్ పీరియన్స్ ని మెరుగుపరిచింది.నేరేటర్ కి కొత్త నేచురల్ వాయిస్ లను పరిచయం చేసింది.
ఫైల్ ఎక్స్ ప్లోరర్ మోడర్న్ లుక్:
ఈ ఫీచర్ ను మెరుగైన యాక్సెసిబిలిటీ కోసం హోమ్, అడ్రస్ బార్, సెర్చ్ బార్ కి ఎన్ హ్యాన్స్మెంట్ తో మోడర్న్ రీడిజైన్ పొందింది.ఫైల్స్ ను కొత్త గ్యాలరీ ఫీచర్ ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా కోలాబరేటివ్ ఫీచర్స్ పరిచయం చేసింది.
విండోస్ బ్యాకప్:
విండోస్ బ్యాకప్ మొత్తం యూజర్ డేటాను కలిగి ఉంటుంది.బ్యాకప్ లో యాప్స్, సెట్టింగ్స్, ఫైల్స్ అన్నీ ఉంటాయి.
ఈ ఫీచర్ పర్సనల్ కంప్యూటర్లను స్విచ్ చేయడం, సెట్టింగ్స్, ఫైల్స్ సింక్రనైజ్డ్ గా ఉంచడానికి సులభతరం చేస్తుంది.

నోట్ ప్యాడ్ ఆటో సేవ్:
ఈ ఫీచర్ తో మల్టిపుల్ టెక్స్ట్ ఫైల్ల( Multiple text files )ను ఒకసారి బ్రౌజ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ప్రీవియస్ గా ఓపెన్ చేసిన ట్యాబ్ లను రీస్టోర్ చేస్తుంది.