సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
కేసీఆర్ మరోసారి గెలిస్తే తెలంగాణలోని ఆలయ భూములను కూడా అమ్మేస్తారని ఈటల రాజేందర్ ఆరోపించారు.అభివృద్ధి పేరుతో భూములను గుంజుకోవడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ఈటల రాజేందర్ మరోసారి కేసీఆర్ ను నమ్మేందుకు ఎవరూ సిద్దంగా లేరని వెల్లడించారు.