ప్రస్తుత రోజుల్లో చాలామంది శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి బద్దకిస్తూ ఉంటారు.కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి మాత్రం కంటి చూపు లేదు అని కుంగిపోకుండా కష్టపడి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు.
కేవలం అతను మాత్రమే కాకుండా సమాజంలో అవయవయ లోపం ఉన్న చాలా మంది నిరుత్సాహపడకుండా ధైర్యంతో ముందడుగు వేసి మంచి మంచి స్థాయిలకు ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా ఒకరు.
కంటి చూపు లేదని అంతటితో ఆగిపోకుండా కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగాన్ని సాధించాడు.

ప్రస్తుత రోజుల్లో ఉన్న టెక్నాలజీని( Technology ) ఉపయోగించుకొని క్యాబ్ బుక్ చేసుకోవడం ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ ఆప్ ల ద్వారా ఆర్డర్లు పెట్టుకోవడం వంటి పనులను స్వతహాగా చేసుకుంటున్నాడు.అతనే గుజరాత్ అహ్మదాబాద్( Gujarat Ahmedabad ) కు చెందిన అజీజ్ మినాట్( Aziz Minat ).పుట్టుకతోనే కంటి చూపుతో జన్మించిన ఆయన కొద్ది రోజులకు ఆ కంటి చూపును కోల్పోయారు.అజీజ్‌కు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం సూరత్ నుంచి అహ్మద్‌బాద్‌కు వెళ్లారు.ఆ తర్వాత అజీజ్ కుటుంబ సభ్యులు అతన్ని అక్కడే ఆశ్రమ్ రోడ్‌లో ఉన్న అంధుల పాఠశాలలో చేర్పించారు.
కష్టపడి ఉన్నత చదువులు చదివి అజీజ్ ప్రభుత్వ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం సాధించారు.

ఆ తర్వాత ఆయన అమీనా( Amina ) అనే ఒక అంధురాలిని వివాహం చేసుకున్నారు.ఆమె కూడా ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆమె దిల్లీలోని ఆఫీసుకు ఒంటరిగానే వెళ్లి క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజూ కొంత సమయం అజీజ్ జిమ్‌లో వ్యాయామం కూడా చేస్తుండటం విశేషం.ఇలా కంటి చూపు లేదని అధైర్య పడకుండా కష్టపడి ఉద్యోగం సంపాదించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అజీజ్.







