మందుపాతరలను గుర్తించడంలో ఈ ఎలుక సిద్ధహస్తురాలు.. మృతిచెందడంతో అధికారులు కన్నీరు..!

నేరస్తులను పట్టించడంలో, యుద్ధంలో సైనికులకు సహాయపడటంలోనూ జంతువులు కీలక పాత్ర పోషిస్తుంటాయి.గుర్రాలు, కుక్కలు, పావురాలు, వాసన పసిగట్టగల పక్షులు, ఎలుకలు, పిల్లులు.

ఇలా చాలా జంతువులను ఆర్మీ అధికారులు యుద్ధంలోకి తీసుకెళ్లారు.ఇప్పటికీ కాపలా, బాంబుల గుర్తింపు, నేరస్తులు పట్టించడం వంటి విషయాల్లో జంతువులు క్రియాశీలకంగా ఉన్నాయి.

అయితే శునకాల తర్వాత ఎలుకలు మందుపాతరలను గుర్తించడంలో బాగా ఉపయోగపడుతున్నాయి.తాజాగా అలాంటి ఓ ఎలుక మృతి చెందింది.

దీంతో అధికారులు కన్నీరుమున్నీరవుతున్నారు.దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.

Advertisement

వివరాల్లోకి వెళితే.మగావా అనే పేరుగల ఒక ఆఫ్రికన్ జాతి ఎలుక ఆగ్నేయాసియా దేశమైన కంబోడియాలోని అంతర్యుద్ధంలో తన సేవలను అందించింది.

ఇది తన ఐదేళ్ల కెరీర్‌లో వందలకొద్దీ మందుపాతరలు, పేలుడు పదార్థాలను గుర్తించి ఎందరో ప్రాణాలను కాపాడింది.అందుకే దీన్ని హీరో ర్యాట్ గా పిలుస్తుంటారు.

అయితే ఎనిమిదేళ్ల పాటు బతికిన ఈ ఎలుక వృద్ధాప్య సమస్యలతో తాజాగా కన్నుమూసింది.దీని పనితీరు తగ్గిపోవడంతో జూన్ నెలలో సేవల నుంచి తప్పుకుంది.

ఆ తర్వాత ఉత్సాహంగానే ఉంది కానీ కొద్ది రోజులకే తక్కువగా తినడం, ఎక్కువ సేపు నిద్ర పోవడం చేసింది.అలా బాగా క్షీణించిపోయిన ఈ ఎలుక కన్నుమూసిందని బెల్జియంకి చెందిన అంతర్జాతీయ చారిటీ సంస్థ ఏపీఓపీఓ ప్రకటించింది.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?

1.2 కేజీల బరువు, 28 ఇంచులు పొడవు ఉండే మగావా అనేక ఇతర ఎలుక జాతుల కంటే చాలా పెద్దది.అయితే ఇది పేలుడు పదార్థాలపై నడిచినా అవి పేలకపోయేవి.

Advertisement

మగావా కంబోడియాలో 2,25,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమిని క్లియర్ చేయడంలో సంస్థకు సహాయపడింది.ఇక్కడ దశాబ్దాల సంఘర్షణలో ప్రమాదకరమైన మందుపాతరల వల్ల చాలామంది అవయవాలు, కొందరు ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు