అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో భూముల వివాదం క్రమంగా ముదురుతోంది.ఈ మేరకు మంత్రి ఉషశ్రీ చరణ్, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
మంత్రి చేస్తున్న భూ ఆక్రమణలను నిరూపిస్తామని టీడీపీ నేత హనుమంతరాయ చౌదరి చెబుతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే మంత్రి భూముల వద్దకు వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధం అయ్యారు.
వివాదం నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.మంత్రి భూముల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.
దీంతో కల్యాణదుర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.







