చిరంజీవి ఇంట్లో లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ..!

ఆమీర్ ఖాన్ లీడ్ రోల్ లో బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా.ఈ మూవీని అద్వైత్ చందన్ తెరకెక్కించారు.

 Lal Singh Chaddha Premier Show In Megastar Chiranjeevi House , Lal Singh Chaddha-TeluguStop.com

ఆమీర్ ఖాన్ కి జోడీగా ఈ మూవీలో కరీనా కపూర్ నటించారు.ఈ సినిమాలో మన అక్కినేని హీరో నాగ చైతన్య కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.

నాగ చైతన్య నటించడం వల్ల ఆ సినిమాకు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.అంతేకాదు సినిమా తెలుగు రిలీజ్ ని కూడా చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్ లాల్ సింగ్ చద్దా తెలుగు వర్షన్ ని రిలీజ్ చేస్తుంది.అల్లు అరవింద్ సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే అందులో ఖచ్చితంగా మ్యాటర్ ఉన్నట్టే లెక్క.

ఆగష్టు 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా ప్రీమియర్ షోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వేశారని తెలుస్తుంది.చిరు హోన్ థియేటర్ లో లాల్ సింగ్ చద్దా టీం తో ఈ సినిమా చూశారట.

గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్న ఉద్దేశంతో కావొచ్చు లేదా చిరుతో ఈ సినిమాకు ప్రమోషన్ చేయిద్దాం అన్న ఆలోచన కావొచ్చు.అలా చిరు తో ఆమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి లాల్ సింగ్ చద్దా సినిమా చూశారు.

Telugu Aamir Khaan, Chiranjeevi, Naga Chaitanya, Nagarjuna, Rajamouli, Sukumar-M

అయితే ఈ ప్రివ్యూ షోలో నాగార్జున కూడా ఉన్నారు.నాగ్ కూడా ఈ సినిమా చూసినట్టు తెలుస్తుంది.ఈ ప్రీమియర్ షోలో రాజమౌళి, సుకుమార్ కూడా పాల్గొనడం విశేషం.నెల ముందే సినిమా చూపించి తెలుగులో ఈ మూవీని భారీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాతో ఆమీర్ ఖాన్ మరో సెన్సేషనల్ హిట్ కొడతారని అనుకుంటున్నారు.అయితే తెలుగు సినిమాలు హిందీ బాక్సాఫీస్ పై సత్తా చాటుతున్న ఈ టైం లో హిందీ సినిమాని తెలుగులోకి తెచ్చి ఇక్కడ మంచి ఫలితాన్ని రాబట్టాలని చూస్తున్నారు.

మరి లాల్ సింగ్ చద్దా మూవీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube