తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.మంచు మోహన్ బాబు సీనియర్ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఇక ఈయన వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇకపోతే మంచు కుటుంబంలో ఏ ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టిన లేదా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వీరి గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణం.
అయితే ఈ ట్రోలింగ్స్ ను మంచు ఫ్యామిలీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ విధంగా తమ ఫ్యామిలీ గురించి చెడుగా ప్రచారం చేసే వారిపై నష్టపరిహారం దావా వేస్తామని చెప్పినప్పటికీ నేటిజన్స్ మాత్రం తగ్గేదే అంటూ అవకాశం దొరికిన ప్రతిసారి మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే గత కొంతకాలంగా మంచు వారసుల మధ్య విభేదాలు వచ్చాయని అందుకే మంచు విష్ణు మనోజ్ దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వినిపించాయి.తాజాగా మంచు లక్ష్మి ప్రసన్న స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి తమ ఫ్యామిలీలో ఉన్న విభేదాల గురించి మాట్లాడుతూ మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఇది పూర్తిగా మా పర్సనల్ విషయాలని ఈమె చెప్పుకొచ్చారు.మేమందరం ఎప్పుడు కలిసే ఉంటాం అయితే ప్రస్తుతం మంచు విష్ణు పిల్లలు ఫ్యామిలీ బిజినెస్ అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక నేను మనోజ్ మాత్రమే సమయం దొరికినప్పుడు కాస్త టైమ్స్ స్పెండ్ చేస్తూ ఉంటామనీ చెబుతూ తమ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు.







