Lakshmi Pranati Upasana: లక్ష్మీ ప్రణతి మనసు ఎంత మంచిదో.. కడుపుతో ఉన్న ఉపాసన కోసం ఏం చేసిందంటే?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్( NTR ) సతీమణి లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranati ) తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

పద్ధతిగా, మౌనంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక ఈమె ప్రత్యేకంగా ఫ్యాన్స్ తో అంత పరిచయం పెంచుకోలేదు అని చెప్పాలి.మామూలుగా ఇతర హీరోల భార్యలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆ వేదిక ద్వారా తమ పరిచయాన్ని పెంచుకున్నారు.

కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండనట్లు కనిపించింది.అసలు ఆమెకు సోషల్ మీడియాలో ఖాతా ఉందో లేదో కూడా క్లారిటీ లేదు.

ఒక స్టార్ హీరో భార్యగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు సోషల్ మీడియాతో పని లేదంటే ఆమె ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.ఇక ఎప్పుడైనా సందర్భం ఉంటేనే ఎన్టీఆర్ తో పాటు బయట కనిపిస్తూ ఉంటుంది.

Advertisement
Lakshmi Pranati Send Home Made Sweets To Upasana-Lakshmi Pranati Upasana: ల�

అప్పుడప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫంక్షన్లలో కనిపిస్తూ ఉంటుంది.ఇక ఆ సమయంలోనే ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది.

అందుకే చాలామంది అభిమానులు ఎన్టీఆర్ భార్యని చూసి ఫిదా అవుతుంటారు.

Lakshmi Pranati Send Home Made Sweets To Upasana

ఇంటిపట్టునే ఉంటూ భర్త, పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది ప్రణతి.ఇక ప్రణతికి రామ్ చరణ్ భార్య ఉపాసనతో( Upasana ) మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే.ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ గా మారారో అప్పటినుంచి ఉపాసన, ప్రణతి కూడా బాగా క్లోజ్ అయ్యారు.

సినిమాకి సంబంధించిన పలు సందర్భాలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు వీరిద్దరు కూడా విదేశాలలో తిరిగారు.ఇక గతంలో ఉపాసన ప్రణతి బర్త్డేకి కూడా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిందే.దాదాపు 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.

Lakshmi Pranati Send Home Made Sweets To Upasana
Advertisement

ఇక ఈ విషయం తెలుగు ప్రేక్షకులను బాగా సంతోష పెట్టింది.ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా విదేశాలలో తిరుగుతుంది.ఇదంతా నాచురల్ ప్రెగ్నెన్సీ కోసమే అని తెలిసింది.

ఇక ఇప్పటికే తన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిపి రెండుసార్లు సీమంతం కూడా జరుపుకుంది.వాటికి సంబంధించిన ఫోటోలు కూడా పంచుకుంది.

ఇక ఇదంతా పక్కనే పెడితే.ఉపాసన ప్రెగ్నెంట్ అని.ఈ సమయంలో తనకు బాగా ఫుడ్ తినాలనిపిస్తుందనుకొని ప్రణతి స్వయంగా తన చేతులతో చేసిన డ్రైఫ్రూట్స్ లడ్డు, సున్నుండలు ఉపాసనకు స్పెషల్ గా పంపించిందట.ఉపాసన మీద ప్రేమతో స్వయంగా తనే చేసిన పదార్థాలను లక్ష్మీ ప్రణతి పంపించడంతో అభిమానులు ఫీదా అవుతున్నారు.

ఇక చరణ్ సైతం లక్ష్మీ ప్రణతికి ఉపాసనపై ఉన్న ప్రేమకు షాక్ అయిపోయాడట.ఎన్టీఆర్ అయితే అసలు స్టెన్ అయిపోయాడట.ఇంట్లో నేను ఎప్పుడు చెప్పినా నాకోసం చేయదు.

ఉపాసన కోసం మాత్రం టైం కేటాయించి మరీ చేసింది అంటూ షాక్ అయిపోయాడట.ప్రస్తుతం ఈ విషయం అందర్నీ ఆకట్టుకుంది.

తాజా వార్తలు