స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మి పార్వతి మీద ఎన్నికల ముందు కోటి అనే వ్యక్తి లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడంతో పాటు, కేసు కూడా పెట్టాడు.కొడుకు వయసు ఉన్న తనని లక్ష్మి పార్వతి వేధిస్తుందని, వాట్స్ ఆప్ చాటింగ్ లలో అసభ్యకరమైన సందేశాలు పెడుతూ కోరిక తీర్చాలని అడుగుతుందని, ఆమె మాటలకి, చేతలకి తాను మానసికంగా వేదనకి గురవుతున్నా అంటూ ఆమె దగ్గర అసిస్తేన్త్ట్ గా పనిచేసే కోటీ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకి వచ్చాడు.
తాజాగా కోటి వాఖ్యలపై లక్ష్మి పార్వతి మీడియా ముందుకి వచ్చింది.కోటి నాకు బిడ్డలాంటివాడు.మా కుటుంబం అతనికి ఎంతో గౌరవం ఇచ్చింది.అమ్మా అంటూ పిలిచి ఇంత నీచానికి ఒడిగట్టాడు.
కోటితోపాటు ఈ కుట్ర వెనక ఉన్న అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కోరారు.సోషల్ మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
సోమవారం డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆమె ఆయన సూచన మేరకు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు.కొన్ని మీడియా చానల్స్ కూడా తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.