సుప్రీంలో లఖింపూర్ ఖేరీ కేసు విచారణ.. ఆశిశ్ మిశ్రాకు ఊరట

లఖింపూర్ ఖేరీ కేసుపై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ క్రమంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాకు స్వల్ప ఊరట లభించింది.

ఆశిశ్ మిశ్రా ఢిల్లీ రావడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది.మధ్యంతర బెయిల్ షరతులను మార్చిన సుప్రీం ధర్మాసనం ఆశిశ్ మిశ్రా ఢిల్లీలో ఉండేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి అనుమతి కల్పించింది.ఈ క్రమంలోనే యూపీలో ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అయితే ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో అక్టోబర్ 2021లో జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో పాటు ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?

తాజా వార్తలు