తాను చనిపోతూ సంజయ్ దత్ కు ఆస్తిని రాసిచ్చిన అభిమాని.. చివరకు ఏమైందంటే?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఎన్నో సినిమాలలో తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంజయ్ దత్.

ఇక కేజిఎఫ్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు.ఆ తర్వాత వచ్చిన లియో, డబుల్ ఇస్మార్ట్ ( Double smart )లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలీవుడ్‌లో ఆయనకు డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.అయితే ముంబైకి చెందిన నిషా పాటిల్ ( Nisha Patil )అనే అభిమాని సంజూ కోసం ఏకంగా తన ఆస్థి మొత్తాన్ని రాసిచ్చింది.

ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Lady Fan 72 Cr Property Transfer Actor Sanjay Dutt, Sanjay Dutt, Bollywood, Asse
Advertisement
Lady Fan 72 Cr Property Transfer Actor Sanjay Dutt, Sanjay Dutt, Bollywood, Asse

సంజయ్‌ దత్‌ అంటే నిషా పాటిల్‌కు 62 చాలా అభిమానం దీంతో 2018 సమయం సంజయ్‌ దత్‌ పేరిటి ఆమె ఒక వీలునామా రాసింది.ఆమె మరణానంతరం రూ.72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్‌ కు బదిలీ చేయాలని అందులో పేర్కొంది.అయితే తన జీవితకాంలో ఆమె ఎప్పుడూ దత్‌ ను వ్యక్తిగతంగా కలవలేదు.

గృహిణిగా ఉన్న ఆమె సంజయ్‌ దత్‌ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేది.కేవలం అతని నటనా నైపుణ్యానికి నిషా పాటిల్‌ ఆకర్షితురాలైంది.

బాలీవుడ్ ఒకప్పటి లెజెండ్స్ దివంగత సునీల్ దత్, నటి నర్గీస్‌ ల కుమారుడు అని కూడా సంజయ్ దత్ మీద ప్రేమ ఉంది.అయితే నిషా పాటిల్ కొద్ది రోజు క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు.

Lady Fan 72 Cr Property Transfer Actor Sanjay Dutt, Sanjay Dutt, Bollywood, Asse

తాను మరణిస్తానని ఆమె ముందే గ్రహించి ముందే రాసి ఉంచిన కొన్ని లెటర్స్‌ బ్యాంకులకు పంపారు.తన ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం సంజయ్‌ దత్‌ కు మాత్రమే బదిలీ చేయాలని అందులో పేర్కొన్నారు.వీలునామా ప్రకారం తన ఆస్తి మొత్తం సంజయ్ దత్‍ కే చెందుతుందని లీగల్‌ గా కూడా పత్రాలు రాసి ఉంచారు.

చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి

దీంతో తన ఆస్తి అంతా సంజయ్ పేరిట ఉంది.బ్యాంకు అధికారుల ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్న సంజయ్‌ దత్‌ ఆశ్చర్యపోయారు.నిషా పాటిల్‌ ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారు.

Advertisement

కానీ, ఆమె చూపిన అభిమానం పట్ల ఆయన చలించిపోయారు.ఆమెకు సంబంధించిన ఆస్తి తనకు వద్దని ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అంతటి అభిమానిని కలుసుకోలకపోయాననే బాధ ఉందని తెలిపారు.తన పేరుతో ఉన్న ఆస్తులన్నీ నిషా పాటిల్‌ కుటుంబ సభ్యులకు అందేలా లీగల్‌ టీమ్‌ ను దత్‌ ఏర్పాటు చేశారు.

త్వరలో ఆమె కుటుంబ సభ్యులనైనా కలుస్తానని అన్నారు.ఈ విషయం పట్ల అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

తాజా వార్తలు