సికింద్రాబాద్.దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించి ఒలంపిక్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా 6 వ జాతీయ ఫీస్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించినట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ ఇండోర్ స్టేడియంలో ఆరవ జాతీయ ఫీస్ట్ బాల్ పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉత్తర మండల డిసిపి చందనాదీప్తి, కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డిలు ప్రారంభించారు.ఈ టోర్నీలో పాల్గొంటున్న 17 జట్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.
ఉత్తర మండల డిసిపి చందనాదీప్తి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కాసేపు ఫీస్ట్ బాల్ ఆడుతూ సందడి చేశారు.బోయిన్పల్లి క్రీడామైదానంలో అట్టహాసంగా ఫెస్ట్ బాల్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాల నుండి హాజరైన ఫీస్టివల్ ఆటగాళ్లకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఆటలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తిని కనబరుస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఫీస్ట్ బాల్ ఆట ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.త్వరలోనే జాతీయ చుట్టూ ఆస్ట్రేలియా పర్యటన కూడా చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు నుండి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ నడిపించిన కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కు అభినందనలు తెలియజేశారు.ఉత్తర మండల డీసీపీ చందనాదీప్తి, కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి మొదటి మ్యాచ్ లో తలపడ్డ చండీఘర్ తెలంగాణ జట్ల మధ్య మ్యాచ్ ను తిలకించారు.







