జీవిత కాలం చెల్లేవిధంగా లేబర్ కార్డులు..: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట జిల్లాలో జరిగిన భవన నిర్మాణ రంగాల కార్మికుల మహాసభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రగతికి మూలాధారం కార్మికుడేనని పేర్కొన్నారు.

 Labor Cards With Lifetime Expiry..: Minister Harish Rao-TeluguStop.com

అందరికీ ఉచితంగా లేబర్ కార్డు ఇప్పిస్తామని చెప్పారు.లేబర్ అధికారుల చేతులు తడిపితే తప్ప చెక్కులు అందడం లేదన్న ఆయన ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

కొత్తగా ఇచ్చే లేబర్ కార్డులు జీవిత కాలం చెల్లుతాయని పేర్కొన్నారు.అదేవిధంగా మరణించిన కార్మికులకు వచ్చే రూ.1.30 లక్షలను రూ.3 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.కార్మిక కార్డ్ ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు వర్తింపు ఉంటుందన్నారు.కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ లాంటి పెద్ద వ్యాధులకు రూ.10 లక్షల బీమా అందిస్తామని తెలిపారు.ఈ నేపథ్యంలోనే వచ్చే నెలాఖరు కల్లా వెయ్యి పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు.

న్యాక్ లో కార్మికులు శిక్షణ పొంది నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube