జీవిత కాలం చెల్లేవిధంగా లేబర్ కార్డులు..: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట జిల్లాలో జరిగిన భవన నిర్మాణ రంగాల కార్మికుల మహాసభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రగతికి మూలాధారం కార్మికుడేనని పేర్కొన్నారు.అందరికీ ఉచితంగా లేబర్ కార్డు ఇప్పిస్తామని చెప్పారు.

లేబర్ అధికారుల చేతులు తడిపితే తప్ప చెక్కులు అందడం లేదన్న ఆయన ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

కొత్తగా ఇచ్చే లేబర్ కార్డులు జీవిత కాలం చెల్లుతాయని పేర్కొన్నారు.అదేవిధంగా మరణించిన కార్మికులకు వచ్చే రూ.

1.30 లక్షలను రూ.

3 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.కార్మిక కార్డ్ ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో రూ.

5 లక్షల వరకు వర్తింపు ఉంటుందన్నారు.కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ లాంటి పెద్ద వ్యాధులకు రూ.

10 లక్షల బీమా అందిస్తామని తెలిపారు.ఈ నేపథ్యంలోనే వచ్చే నెలాఖరు కల్లా వెయ్యి పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు.

న్యాక్ లో కార్మికులు శిక్షణ పొంది నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.

టెల్ అవీవ్ దాడి: బిడ్డను రక్షించేందుకు ఇజ్రాయెల్ మహిళ ప్రాణాలు త్యాగం..