టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ( Nagarjuna )ఒకరు.అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నాగార్జున ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇప్పటికీ ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున వ్యక్తిగత జీవితంలో మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనంతరం ఈయన సంతోషంగా ఉన్నారు.
నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీని( Lakshmi ) వివాహం చేసుకున్నారు.
వీరిద్దరికి నాగచైతన్య ( Nagachaitanya ) పుట్టిన తర్వాత మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని వెళ్లిపోయారు అనంతరం నాగార్జున ఒంటరిగా ఉంటూ హీరోయిన్ అమల,( Amala )ను ప్రేమించారు అయితే ఈయన అమలను పెళ్లి చేసుకొని మరో బిడ్డకు జన్మనిచ్చారు ప్రస్తుతం వీరంతా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇకపోతే నాగార్జున అమలకు ప్రపోజ్ చేస్తున్న సమయంలో అమల వెంటనే తనకు ఓకే చెప్పలేదు అంటూ నాగార్జున వారి ప్రేమ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
![Telugu Amala, Laatestamala, Love, Tollywood-Movie Telugu Amala, Laatestamala, Love, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/laatest-news-about-amala-and-nagarjunaa.jpg)
సినిమాలలో నటిస్తున్న సమయంలో అమలతో నేను సినిమాలు చేశానని సమయంలోనే తన పై ప్రేమ పుట్టిందని నాగార్జున తెలియజేశారు. అయితే ఒకరోజు అనుకోకుండా నేనే తనకు ప్రపోజ్ చేశాను తనకు ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసిందని నాగార్జున తెలిపారు.అది బాధతో కూడిన కన్నీళ్లు కాదని సంతోషంతో కూడిన కన్నీళ్లు అని తెలిపారు.అయితే నేను ప్రపోజ్ చేసినప్పటికీ తాను వెంటనే ఓకే చేయలేదని నాగార్జున తెలిపారు.
![Telugu Amala, Laatestamala, Love, Tollywood-Movie Telugu Amala, Laatestamala, Love, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/laatest-news-about-amala-and-nagarjunab.jpg)
నేను ప్రపోజ్ చేసిన తర్వాత దాదాపు నాలుగైదు సంవత్సరాల సమయం తీసుకుని తన ప్రేమను యాక్సెప్ట్ చేసింది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తాను అమలను ప్రేమిస్తున్నాననే విషయం తెలియడంతో అమ్మానాన్నలు హ్యాపీగా లేరని బయట ఏమనుకుంటారన్న ఆలోచన వాళ్ళు చేశారని తెలిపారు.కానీ తరువాత తన ప్రేమను వాళ్లు కూడా యాక్సెప్ట్ చేశారు అంటూ ఈ సందర్భంగా తన ప్రేమ విషయాలను గురించి నాగార్జున చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.