కువైట్ : అమలు కానున్న కొత్త రెసిడెన్సీ చట్టం...ఇది అమలైతే ఒక్క కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వదట...

ప్రవాసులకు గడిచిన ఏడాదిగా చుక్కలు చూపిస్తున్న కువైట్ కరోనా సమయంలో ఇదే ప్రవాస నిపుణులు లేకపోవడంతో చుక్కలు చూసింది.ప్రవాసులు దేశం విడిచి స్వదేశాలకు వెళ్ళడంతో మరి కొందరు కరోనా కారణంగా కువైట్ రాలేకపోవడంతో ఎంతో మందిని ఉద్యోగాల నుంచీ తొలగించింది.2017 లో చేసుకున్న కువైటైజేషన్ చట్టాన్ని అప్పటి నుంచీ అమలు చేయడానికి వీలు అనుకున్న ప్రభుత్వం అదే పనిగా కువైట్ లో ప్రవాసులను ప్రభుత్వ, ప్రవైటు ఉద్యోగాల నుంచీ తొలగిస్తూ వస్తోంది.ప్రవాసులను తొలగిస్తూ తమ స్థానికులకు ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో నిభంధనలను అమలు చేస్తూ, కొత్త కొత్త చట్టాలని తెరపైకి తీసుకువస్తోంది.

 Kuwait: New Residency Law To Be Implemented If This Is Implemented, Not A Single-TeluguStop.com

కువైట్ తాజాగా మరో సరికొత్త చట్టాన్ని అమలు చేయడానికి సిద్దంగా ఉందట.ఈ చట్టం అమలైతే ఇక కువైట్ లో ఉద్యోగం ఇవ్వడానికి ఒక్క కంపెనీ ముందుకు రాకపోగా, కువైట్ వెళ్ళాలనే ఆలోచనే ఎవరికీ ఉండదని అంటున్నారు నిపుణులు.

ఇంతకీ ఆ చట్టంలో ఎలాంటి రూల్స్ ఉండబోతున్నాయంటే.

ప్రవైటు, ప్రభుత్వ రంగాలలో వలస వాసుల ప్రభావాన్ని తగ్గించే విధంగా, ఇకపై ఏ వలస ప్రవాసుడు కువైట్ లో అడుగు పెట్టని విధంగా ఈ చట్టం ఉండబోతోందట.అక్రమంగా కువైట్ లోకి ఎవరైనా ప్రవేశిస్తే లేదంటే ఏ కంపేనే అయినా సరే అలాంటి వారిని నియమించుకుంటే సదరు కంపెనీకి లేదా వ్యక్తికి సుమారు రూ.13 లక్షల నుంచీ రూ.1 కోటి వరకూ జరిమానా ఉంటుందట.అలాగే ప్రభుత్వ ప్రాజెక్ట్ లలో ఉద్యోగాలలోకి ప్రవాసులను నియమించుకోవాలని భావించే కంపెనీలు ఒక్కొక్క కార్మికుడికి రూ.1 లక్ష కు పైగా డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుందట, అలాగే వారికి కంపెనీ జీవిత భీమా కూడా చేయించాలని చట్టంలో ఉంటుందట.అసలు ట్విస్ట్ ఎంటటే నియమించుకున్న కార్మికులలో ఖర్మ కాలి ఎవరైనా కువైట్ నిభంధనలను అతిక్రమించి బహిష్కరణకు గురైతే అందుకు అయ్యే ఖర్చు, వారిని వారి దేశం పంపేందుకు అయ్యే ఖర్చును సైతం సదరు కంపెనీ భరించాల్సిందేనట.

మరి ఇలాంటి నిభందనలు చట్టం అయితే ఒక్క ఏ ఒక్క కంపెనీ కూడా ప్రవాసులు ఉద్యోగాలలోకి తీసుకోవడం జరగదు.ఇదిలాఉంటే ప్రపంచ వ్యాప్తంగా కువైట్ కు అత్యధికంగా వలసలు వెళ్ళేది భారత్ నుంచే కాబట్టి ఈ ప్రభావం భారతీయ ప్రవాసులపై అత్యధికంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube