ఖుషి సెకండ్ సింగిల్ అప్డేట్.. విజయ్ - సమంత రొమాంటిక్ పోస్టర్ తో క్లారిటీ!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి’ ( Khushi ).విజయ్, సమంత ఇద్దరి ఖాతాలో ప్రజెంట్ ప్లాప్స్ ఉండడంతో ఈ జంట హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 Kushi's Second Single Aradhya To Come Out On This Date, Vijay Devarakonda, Khush-TeluguStop.com

విజయ్ లైగర్ సినిమాతో, సమంత శాకుంతలం సినిమాతో భారీ ప్లాప్ లను అందుకున్న విషయం తెలిసిందే.

అందుకే ఖుషి వంటి ఆకట్టుకునే లవ్ స్టోరీతో అయిన ఇద్దరు కలిసి హిట్ అందుకోవాలని చూస్తున్నారు.

శివ నిర్వాణ ( Shiva Nirvana )తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా షూట్ ఇప్పటికే క్లైమాక్స్ కు చేరుకుంది.

ఆల్మోస్ట్ పూర్తి అయినట్టే సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుస ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగానే చార్ట్ బస్టర్ గా నిలిచింది.హేషమ్ అబ్దుల్( Hesham Abdul ) అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.”ఆరాధ్య” అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ప్రోమోను సోమవారం రిలీజ్ చేయనున్నారు.

అలాగే పూర్తి లిరికల్ సాంగ్ జులై 12న రిలీజ్ కానుంది.ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటుంది.విజయ్, సమంత రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్.

ఇక ఈ పాట గురించి విజయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ పాట చాలా ప్రత్యేకమైంది అంటూ తెలిపారు.దీంతో ఆడియెన్స్ మరింతగా ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube