విడాకులు తీసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటి.. హృదయానికి బరువుగానే ఉందని చెబుతూ?

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.తాజాగా మరో నటి విడాకులకు సంబంధించిన ప్రకటన చేసి అభిమానులకు షాకిచ్చింది.

 Actress Kusha Kapila Divorce With Husband Zorawar Goes Viral In Social Media Det-TeluguStop.com

ప్రముఖ బాలీవుడ్ నటి కుషా కపిల( Actress Kusha Kapila ) ఒకవైపు సినిమాలతో మరోవైపు వెబ్ సిరీస్ లతో క్రేజ్ ను పెంచుకున్నారు.జోరావర్ సింగ్ ఆహ్లువాలియను( Zorawar Singh Ahluwalia ) 2017 సంవత్సరంలో ఈమె పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్లైన ఆరేళ్ల తర్వాత తన భర్తతో విడిపోతున్నట్టు ఈ నటి ప్రకటించారు.ఈ విడాకులకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఈమె ప్రకటించారు.

నా భర్త, నేను కలిసి విడిపోవాలని నిర్ణయించుకున్నామని కుషా కపిల చెప్పుకొచ్చారు.విడాకులు( Kusha Kapila Divorce ) తీసుకోవాలనే నిర్ణయం సరైన నిర్ణయం కాదని నాకు తెలుసని కుషా కపిల అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ మా లైఫ్ లో ఈ విధంగా చేయడమే సరైనదని మేము భావిస్తున్నామని కుషా కపిల చెప్పుకొచ్చారు.మా లవ్, లైఫ్ లో ప్రతిదానికి అర్థం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.కానీ ప్రస్తుతం మేము కోరుకునే విషయాలలో మాత్రం ఏకీభవించడం లేదని కుషా కపిల పేర్కొన్నారు.ఇకపై కలిసి ఉండకూడదని నిర్ణయం తీసుకున్నామని కుషా కపిల చెప్పుకొచ్చారు.మా బంధం ముగియడం హృదయానికి బరువుగానే ఉందని ఆమె అన్నారు.

ఇది మాకు, మా కుటుంబాలకు కఠినమైన పరీక్ష అని కుషా కపిల చెప్పుకొచ్చారు.ఇది జరగడానికి మాకు కొంత సమయం పడుతుందని ఆమె కామెంట్లు చేశారు.ప్రస్తుతం కుషా కపిల సెల్ఫీ( Selfiee ) అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.

కుషా కపిల చేసిన పోస్ట్ కు 2,75,000కు పైగా లైక్స్ వచ్చాయి.కుషా కపిల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube